సంధ్య థియేటర్ ( Sandhya theater )ఘటన ఈ మధ్య కాలంలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కొడుకు శ్రీతేజ్ కు వైద్య చికిత్స కొనసాగుతోంది.
ఈ ఘటనలో రేవతి మరణించడం తనను ఎంతగానో బాధించిందని చెప్పిన అల్లు అర్జున్ ( Allu Arjun )తాజాగా ఆస్పత్రిలో శ్రీతేజ్ ను పరామర్శించడంతో పాటు బాలుడికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు.
ఈ ఘటన విషయంలో మెగా హీరోల( Mega heroes ) నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాగా మెగా డాటర్ నిహారిక( Mega daughter Neharika ) ఈ ఘటన గురించి స్పందించారు.
మద్రాస్ కారన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక ఈ ఘటన గురించి మాట్లాడారు.రేవతి( revathi ) విషయం తెలిసిన వెంటనే నా మనసు ముక్కలైందని నిహారిక తెలిపారు.
ఇలాంటి ఘటనలను ఎవరూ ఊహించరని ఈ ఘటనల వల్ల బన్నీ కూడా షాక్ కు గురయ్యారని ఆమె చెప్పుకొచ్చారు.
అందరి ప్రేమాభిమానంతో బన్నీ ఈ ఘటన నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని నిహారిక కామెంట్లు చేశారు.బన్నీ నుంచి తాను చాలా నేర్చుకున్నానని ఆమె అన్నారు.లుక్స్ విషయంలో బన్నీ చాలా కేర్ తీసుకుంటారని సినిమా సినిమాకు స్టైల్ మార్చుకుంటారని ఈ విషయంలో అల్లు అర్జున్ నుంచి తాను స్పూర్తి పొందుతానని నిహారిక కామెంట్లు చేశారు.
ఇంటర్వ్యూలలో ఏ విధంగా మాట్లాడాలో తాను రామ్ చరణ్ ను చూసి నేర్చుకుంటానని నిహారిక తెలిపారు.స్క్రిప్ట్ సెలెక్షన్ విషయంలో తాను బన్నీ నుంచి సలహాలు తీసుకుంటానని ఆమె వెల్లడించారు.నిహారిక చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నిహారిక తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.నిహారిక కోలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ కావాలని ఆమె అభిమానులు భావిస్తున్నారు.