నోటి స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండాలా? అయితే ఈ టిప్స్ పాటించాల్సిందే!

సాధార‌ణంగా కొంద‌రిని దంత క్షయం, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి ర‌క్తం కార‌డం, నోటి పూత‌, దుర్వాసన రావ‌డం వంటి నోటి స‌మ‌స్య‌లు త‌ర‌చూ ఇబ్బంది పెడుతుంటాయి.దంతాలను శుభ్రంగా బ్రష్ చేసినంత మాత్రాన వీటికి దూరంగా ఉండొచ్చు అని అనుకుంటే పొర‌పాటే అవుతుంది.

 Oral Diseases, Oral Health, Health Tips, Good Health, Health, Latest News, Oral-TeluguStop.com

అవును, నోటి స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండాలంటే కేవ‌లం బ్ర‌ష్ మాత్ర‌మే స‌రిపోదు.మ‌రిన్ని టిప్స్ ను కూడా పాటించాల్సి ఉంటుంది.

మ‌రి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Latest, Oral Diseases, Oral, Oral Problems, Tips Oral-Telugu Health

నోటి స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండాలంటే మొద‌ట మంచి ఆహారం తీసుకోవాలి.

ముఖ్యంగా ఫైబ‌ర్, విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌ పుష్క‌లంగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకోవటం వల్ల దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది.షుగ‌ర్‌, షుగ‌ర్‌తో త‌యారు చేసి ఆహారాలు, బేకరీ ఫుడ్స్‌, చిప్స్, సోడాలు, షుగరీ డ్రింగ్స్, ఆల్కహాల్‌, పొగాకు వంటివి నోటి ఆరోగ్యానికి తీవ్రంగా దెబ్బ తీస్తాయి.

కాబ‌ట్టి వీటిని ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

శ‌రీరంలో నీటి శాతం త‌క్కువైన‌ప్పుడు సైతం నోటి పూత‌, నోటి దుర్వాస‌న వంటి స‌మ‌స్య‌లు వేధిస్తాయి.

అందు వ‌ల్ల‌, మీ శ‌రీరానికి త‌గినంత నీటిని అందించాల్సిన బాధ‌తే మీదే.

అలాగే కొంద‌రు సూప‌ర్ ఫాస్ట్‌గా బ్రెష్ చేసేసుకుంటారు.

కానీ, క‌నీసం మూడు నాలుగు నిమిషాలు అయినా దంతాల‌ను మెల్ల‌గా రుద్దుకుని నోటిని శుభ్రం చేసుకోవాలి.మ‌రియు నాలుకపై టంగ్‌ క్లీనర్‌తో ఖ‌చ్చితంగా క్లీన్ చేయాలి.

త‌ద్వారా నోటి స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మ‌య్యే బ్యాక్టీరియాలు నశిస్తుంది.

Telugu Tips, Latest, Oral Diseases, Oral, Oral Problems, Tips Oral-Telugu Health

ఏవైనా ఆహారాలు తీసుకున్న త‌ర్వాత త‌ప్ప‌ని స‌రిగా మౌత్ వాష్ చేసుకోవాలి.దంతాలు ఆరోగ్యంగా ఉండాల‌న్నా ఫ్లాసింగ్ ఎంతో అవ‌స‌రం.ఫ్లాసింగ్ చేసుకోవ‌డం వ‌ల్ల పళ్ల మధ్యలో పేరుకున్న, ఇరుకున్న ఆహార పదార్థాలు తొలిగిపోతాయి.

అందు వ‌ల్లే ప్రతీ రోజూ రాత్రి నిద్రించే ముందు ఫ్లాసింగ్ చేసుకుంటే పళ్లు, నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ఇక వీటితో పాటుగా ప్ర‌తి ఆరు నెల‌ల‌కు వైద్యుడిని సంప్ర‌దించి దంత ప‌రిక్ష‌ల‌న్నీ చేయించుకోవాలి.

త‌ద్వారా సమస్య ఏదైనా ఉంటే తొలినాళ్లలో గుర్తించడం, వెంట‌నే నివారించుకోవ‌డం సాధ్యం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube