సాధారణంగా గర్భవతులు( pregnant women ) తమ గర్భధారణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.ఆహారం విషయంలో అయితే మరింత జాగ్రత్తగా ఉండాలి.
అయితే కడుపుతో ఉన్నప్పుడు రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఒక్కోసారి ప్రాణాలను కూడా పణంగా పెట్టే సమయం వస్తుంది.
అయితే అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.ఇక చాలా సులువుగా లభించే బార్లీ గింజలకు( barley grains ) ఇలాంటి సమస్యలన్నిటిని దూరం చేసే గుణం ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఇప్పుడు కడుపుతో ఉన్న గర్భిణీలు వారి ఆరోగ్యాన్ని వారి బిడ్డ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి బార్లీ వాటర్ తాగితే మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
గర్భవతులకు ఈ వాటర్ ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రతి పది మంది గర్భిణీలలో ఆరుగురు నార్మల్ డెలివరీ కాకుండా సిజిరియన్ చేయించుకుంటున్నారు.దీనికి కారణం వారి శరీరంలో గర్భాశయం ముఖద్వారం సరైన మోతాదులో లేకపోవడమే అని డాక్టర్లు చెబుతున్నారు.
అందుకే సుఖప్రసవం కావాలి అనుకున్న వారు బార్లీ వాటర్ ( Barley water )ని తాగడం చాలా మంచిది.ఇందులోని మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా లభించడం వలన గర్భాశయం ముఖ ద్వారం రోజురోజుకీ పెరిగి సుఖప్రసవం అయ్యేందుకు సహాయ పడతాయి.
గర్భవతులుగా ఉన్నప్పుడు చాలామంది అధిక బీపీ తో బాధపడుతూ ఉంటారు.అలాంటి వారు ఒక గిన్నెలో, ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక స్పూన్ బార్లి పొడి కలిపి, మరిగించి రోజు తాగుతూ ఉంటే అధిక బీపీ కంట్రోల్ లో ఉంటుంది.గర్భవతిగా ఉన్నప్పుడు రక్తహీనత( anemia ) పెద్ద సమస్యగా మారుతుంది.అలాంటి సమయంలో రక్తహీనతను తగ్గించుకోవడానికి బార్లీ వాటర్ లోని ఐరన్ కంటెంట్ బాగా ఉపయోగపడుతుంది.అందుకే గర్భవతులు రోజుకు గ్లాస్ బార్లీ వాటర్ తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది.