అనూహ్యంగా సినిమాలు వీడి రాజకీయ రంగంలోకి వెళ్ళిన చిరు కాస్త గ్యాప్ తరవాత మళ్ళీ అభిమానుల కోరిక మేరకు బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఖైదీ నెంబర్ 150 చిత్రంతో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చారు.అయితే అప్పటి నుండి వరుస ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీ అయిపోయారు చిరు.ఖైదీ నం.150, సైరా నరసింహ రెడ్డి చిత్రాలు మంచి విజయాలు సాధించి హిట్ ట్రాక్ లో ఉన్న చిరు ఆ తర్వాత సక్సెస్ఫుల్ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేస్తుండటంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి, అందులోనూ రామ్ చరణ్ తేజ్ ఫుల్ లెన్త్ పాత్ర పోషిస్తుండటంతో అభిమానుల ఎక్సపెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి.అలా ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదలయిన ఆచార్య సినిమా ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేకపోయింది.బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా దెబ్బ తిని పరాజయం పాలయ్యింది.
కారణాలు ఏవైనా ఈ సినిమా అయితే చిరు కెరియర్ లో ఫ్లాప్ గా మిగిలిపోయింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో డిజాస్టర్ ల లిస్ట్ లో ఆచార్య సినిమా కూడా చేరడం అనేది ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు.
అయితే వాస్తవాన్ని ఎవరు మార్చలేరు కదా.అదే కాకుండా అసలు తన కెరియర్ లో ఇప్పటి వరకు పరాజయం అన్నదే ఎరుగని దర్శకుడు కొరటాల సైతం ఈ సినిమాతో మొదటి ఫ్లాప్ ను చూడాల్సి వచ్చింది.ఇదిలా ఉండగా ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో టాప్ డిజాస్టర్ లుగా మిగిలిన సినిమాలు ఏవో చూద్దాం.
మెగాస్టార్ చిరంజీవి ది ఇండస్ట్రీలో సుదీర్ఘ ప్రయాణం అనే చెప్పాలి.1980 లో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ హిట్ లను అందించగా కొన్ని సినిమాలు మాత్రం చెడు జ్ఞాపకాలుగా మిగిలాయి.కానీ ఒక సినిమా జయపజయాన్ని ఎవరూ ఖచ్చితంగా ఊహించలేరు కొన్ని సార్లు అన్ని ఎలిమెంట్స్ ఉన్నా సినిమాలు సైతం ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అవుతుంటాయి.
ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే అగ్ర తారాగణం, మంచి కథ, బెస్ట్ మ్యూజిక్ తో పాటు అనుకూలమైన రిలీజ్ డేట్ ఇలా చాలా సమీకరణాలు ఉంటే తప్ప అన్ని చిత్రాలు ఆశించిన ఫలితాలను అందుకొలేవు.అందుకే అంటుంటారు ఇండస్ట్రీలో ఎపుడు ఏ స్టార్ ఏ స్థాయిలో ఉంటారు అన్నది ఎవరూ చెప్పలేం అని.ఈ విషయాలన్నీ అటుంచితే ఇదే తరహాలో అంచనాలు తారుమారు చేసి మెగాస్టార్ కెరియర్ లో భారీ పరాజయాలను ఎదుర్కొన్న సినిమాల లిస్ట్ ఒకసారి చూసేద్దామా.
అంజి : శ్యామ్ ప్రసాద్ రెడ్డి డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న చిరు భారీ బడ్జెట్ మూవీ అంజి సినిమా అంచనాలను తారుమారు చేసి భారీ పరాజయాన్ని చవిచూసింది.
శంకర్ దాదా జిందాబాద్ : బాలీవుడ్ హీరో సంజయ్ దత్ నటించిన సక్సెస్ఫుల్ మూవీ లగేరహో మున్నాభాయ్ సినిమాని అదే తరహాలో తెలుగులో చిరంజీవి తో శంకర్ దాదా జిందాబాద్ గా రీమిక్ చేయగా అది కాస్త ప్రేక్షకుల ఆదరణ అందుకోలేక డిజాస్టర్ గా మిగిలింది.
మృగరాజు: హాలీవుడ్ చిత్రం ‘ది హోస్ట్ అండ్ ది డార్క్నెస్’ సినిమాకి రీమేక్‌గా తెరకెక్కిన చిరంజీవి మృగరాజు సినిమా సైతం డిజాస్టర్ గా మిగిలింది.గుణ శేఖర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ వసూళ్ల పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడింది.
బిగ్ బాస్: విజయ బాపినీడు డైరెక్షన్ లోవచ్చిన చిరు మూవీ ‘బిగ్‌బాస్’.కూడా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలింది.
రిక్షావోడు : మెగాస్టార్ చిరంజీవి, నగ్మా హీరోహీరోయిన్లుగా నటించిన రిక్షావోడు సినిమా సైతం అంచనాలకు భిన్నంగా డిజాస్టర్ గా నిలిచింది.డైరెక్టర్ గుణ శేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.
ఇదే తరహాలో చిరు, శ్రీదేవి నటించిన ఎస్పీ పరుశురాం, చిరు , విజయశాంతి కాంబోలో వచ్చిన స్టూవర్ట్‌పురం పోలీస్‌స్టేషన్, అలాగే చిరు ప్రధాన పాత్రలో నటించిన లంకేశ్వరుడు, రాజ విక్రమార్క, యుద్ద భూమి, మోహన్ బాబు చిరు కలిసి నటించిన చక్రవర్తి, అదేవిధంగా చిరు చిత్రం ఆరాధన, త్రినేత్రుడు, చిరు, సుహాసిని ల కాంబోలో వచ్చిన కిరాతకుడు, జేబు దొంగ, రుద్ర నేత్ర , చాణక్య శపథం, వేట, చిరంజీవి, ధైర్యవంతుడు, శివుడు శివుడు శివుడు, హీరో వంటి చిత్రాలు కూడా కథలను ఎన్నుకోవడంలో విఫలం అయ్యి మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో డిజాస్టర్ గా మిగిలాయి.