బొల్లి..మచ్చల నివారణకు ఆయుర్వేదంతో చెక్..పెట్టచ్చు

బొల్లి.దీన్ని ఆయుర్వేద భాషలో శ్వేత కుష్టం అంటారు.ఇది వచ్చినవాళ్ళు తీవ్రమైన మానసిక వేదనకి లోనవ్వుతారు.నలుగురిలో తిరగడానికి సైతం ఇబ్బందిగా ఫీల్ అవుతారు.బొల్లి ఎలా ఏర్పడుతుంది అంటే.

 Vitiligo Controled With Only Ayurveda Treatment-TeluguStop.com

మన రక్షణ వ్యవస్థ మెలనోసైట్స్‌పైన దాడి చేయటం వల్ల ఆ ప్రాంతంలో మెలనోసైట్స్‌ నశించి ఆ ప్రాంతం తెల్లబడి మచ్చలు ఏర్పడతాయి.

జీర్ణాశయ వ్యవస్థలో ఏర్పడ్డ ఇన్‌ఫెక్షన్ల వల్ల ఏర్పడతాయి.

బిగుతుగా ఉండే దుస్తులు ధరించటం వల్ల గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఉన్న వారిలో కాలిన గాయాలు, ప్రమాదం జరిగినపుడు ఏర్పడ్డ గాయాలు.

పొగతాగడం.కొంతమందిలో ఆటో ఇమ్మ్యుని సిస్టమ్‌ దెబ్బతిన్నప్పుడు డీపిగ్మెంటేషనకి గురి అవుతారు.

ఇది కణిజాలపై వ్యతిరేకంగా పనిచేయటం వల్ల మెలనిమైట్స్‌ నశించి బొల్లి రావచ్చు.

వీటిలక్షణాలు ఎలా గుర్తించాలి అంటే చిన్నచిన్న మచ్చలుగా ఏర్పడి ఆ తరువాత శరీరం అంతటా వ్యాపిస్తాయి.

చివరికి తెలుపు రంగులోకి మారుతాయి.చర్మం పలచబడినట్లు ఉంటుంది.

కొన్నిసార్లు విపరీతమైన ఎండను తట్టుకోలేదు.జుట్టు రంగుమారటం, రాలిపోవటం, శారీరకంగా అలసిపోవటం లాంటి లక్షణాలుంటాయి.

సాధారణంగా మచ్చలు పోయే అవకాశం లేదని అంటుంటారు కానీ ఆయుర్వేదంలో దీనికి చికిశ్చ ఉందని చెప్తున్నారు.వాత.పిత.కఫ.లోపాలని బ్యాలన్స్ చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు.అంతేకాదు ఎండు అరటి ఆకులు కాల్చగా వచ్చిన బూడిదలో కొంచెం పసుపు కలిపి, ప్రతి పూటా లోపలికి సేవించుచున్న, దీనినే నీటిలో కలిపి బొల్లి మచ్చలపై రాస్తూ ఉన్ననూ, బొల్లి మచ్చలు నశింపగలవు.

ముల్లంగి గింజలను, ఉత్తరేణి ఆకు రసముతో నూరి, చర్మముపై రాయుచున్న బొల్లి మచ్చలు నివారణ అగును.

అడవి తులసి ఆకులను మెత్తగా నూరి, పైన మర్ధనా చేసిన చర్మ వ్యాధులు, మచ్చలు తగ్గును.

ఆయుర్వేద వైద్యులు .వ్యాధి మొదటి దశలోనే గుర్తిస్తే వెంటనే ఆయుర్వేద నిపుణుల వద్దకి వెళ్లడం శ్రేయస్కరం నివారణ సులభం అంటున్నారు వైద్యులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube