కార్తీ శివకుమార్( Karti Sivakumar )… శివకుమార్ చిన్న తనయుడు కార్తీ మనందరికీ పరిచయమే.సూర్య తమ్ముడుగా కూడా కార్తీని తెలుగులో ప్రతి ఒక్కరు గుర్తుపడతారు.
అయితే శివకుమార్ కొడుకుగా కార్తీకి ఇండస్ట్రీ రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్పలేదు.చిన్నతనం నుంచి చదువుల్లో టాప్ గా ఉన్న కార్తికి సినిమాలు అంటే పిచ్చి ఉన్నప్పటికీ ఆ విషయం చెప్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు.
ఇంత బాగా చదువుతున్నావు కాబట్టి నువ్వు ఈ దిశగానే వెళ్ళు అంటూ శివకుమార్ బలవంతం చేయడంతో చెన్నైలోనే విద్యాభ్యాసం పూర్తి చేశాడు.ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత మద్రాసులోనే జాబు కూడా చేస్తున్న సమయంలో అమెరికాలో హైయెస్ట్ స్టడీస్ చేయాలనే ఆలోచన పుట్టింది కార్తీకి.
అనుకున్నదే తడవుగా స్కాలర్షిప్ కి అప్లై చేయడంతో తన మెరిట్ లో పాస్ అయి ఫ్రీగా ఒక సీట్ సంపాదించుకున్నాడు న్యూయార్క్ లోని ఒక యూనివర్సిటీలో.
అలా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అమెరికాలోని టాప్ యూనివర్సిటీలో సీటు సంపాదించుకున్న కార్తి తన రోజు వారి ఖర్చులకోసం కూడా తన తండ్రి దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదు.అక్కడే పార్టీ ఉద్యోగం చేసుకుంటూ తన అవసరాలను తీర్చుకునేవాడు.అలాగే గ్రాఫిక్ డిజైనర్ గా కూడా పనిచేసేవాడు.
తనకున్న కంప్యూటర్ నాలెడ్జ్ తో పార్ట్ టైం లోనే డబ్బులు బాగా సంపాదించేవాడు.అయితే కుటుంబం పక్కన లేదు కాబట్టి తాను అనుకున్నదే తడవుగా అనేక ఫిలిం కోర్సెస్ నేర్చుకోవాలని అనుకున్నాడు.
అక్కడ రెండు లేదా మూడు కోర్సెస్ నేర్చుకునే అవకాశం దొరికింది.అలా తనకున్న సినిమా పిచ్చితో అమెరికాలో కోర్సులు అయితే పూర్తి చేశాడు.
ఇక ఇండియాకు రాగానే నేరుగా మణిరత్నం( Mani Ratnam ) దగ్గరికి వెళ్లి తనకు సినిమాల్లోకి రావాలని ఉంది అనే తన ఆశను చెప్పాడు.మొదటి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరాలనుకున్నాడు దాంతో మణిరత్నం కూడా అవకాశం ఇచ్చాడు సరిగ్గా ఏడాది తిరిగేసరికి హీరోగా కూడా మారిపోయాడు 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు తమిళనాడు స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.శివకుమార్ ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చిన్న కుమారుడు అమెరికాలో పెద్ద చదువులు చదివిన తనకు ఒక్క రూపాయి ఖర్చు కూడా చేయలేదు అంటూ తాను ఒక ప్రౌడ్ తండ్రిని అంటూ చెబుతున్నాడు.అలా కట్టుబట్టలతో అమెరికాకు వెళ్లి డిగ్రీ పట్టాతో ఇంటికి వచ్చాడు కార్తీ.