జాబ్ టెన్షన్, వర్క్ స్ట్రెస్, స్మోకింగ్, డ్రింకింగ్, పోషకాల కొరత, ఆహారపు అలవాట్లు తదితర అంశాల కారణంగా అబ్బాయిల్లో కూడా చాలా మంది అధిక హెయిర్ ఫాల్ ( hair fall) సమస్యతో బాధపడుతున్నారు.జుట్టు రాలడం వల్ల మరింత ఒత్తిడికి లోనవుతున్నారు.
ఎలా హెయిర్ ఫాల్ ను అడ్డుకోవాలో తెలియక సతమతం అవుతున్నారు.మీరు ఈ లిస్ట్ లో ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవకండి.తల స్నానానికి ముందు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే హెయిర్ ఫాల్ కు సులభంగా చెక్ పెట్టవచ్చు.

అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఒక కప్పు వాటర్ పోసుకోవాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో మూడు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి(rice flour) వేసి స్పూన్ తో తిప్పుతూ ఉండలు లేకుండా ఉడికించాలి.దాదాపు పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఇప్పుడు ఉడికించిన బియ్యం పిండిని చల్లారబెట్టుకోవాలి.గోరువెచ్చగా అయిన తర్వాత అందులో ఒక ఫుల్ ఎగ్ ను వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు పెరుగు(curd), వన్ టేబుల్ స్పూన్ ఆవ నూనె(Mustard oil) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒక్కసారి ఈ రెమెడీ పాటించారంటే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు.జుట్టు రాలడాన్ని అరికట్టడం లో ఇప్పుడు చెప్పుకున్న రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.
అలాగే ఈ రెమెడీ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.ఊడిన జుట్టును మళ్లీ మొలిపిస్తుంది.
డ్రై హెయిర్(Dry hair) ను రిపేర్ చేస్తుంది.జుట్టును షైనీ గా సైతం మెరిపిస్తుంది.