ప్రస్తుత రోజులలో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యే కొరకు చాలామంది వివిధ రకాల ప్రయత్నాలు చేయడంతో పాటు సాహసాలు చేస్తూ వార్తలలో నిలుస్తూ ఉన్నారు.
ఒక్కోసారి వైరల్ అవుతున్న వీడియోలలో కొంతమంది చేసే సాహసాలు చూస్తే గుండె గుబెల్ అంటుంది.ఒక్కోసారి అనుకోని సంఘటనల వాళ్ల కొంత మంది చేసే సాహసాలను చూస్తే మాత్రం ఆశ్చర్యానికి లోనవ్వక తప్పదు.
ముఖ్యంగా రైల్వే ట్రాక్స్(Railway tracks) పై, బహిరంగ ప్రదేశాలలో చేసే పనులను చూస్తే మాత్రం ఆశ్చర్యం కలగడంతోపాటు వారికి ఇలాంటి ధైర్య సాహసాలు చేయడానికి ఎలా ముందుకు వెళ్తున్నారో అని ప్రశ్న తలెత్తుతూ ఉంది… అచ్చం అలాగే తాజాగా ఒక మహిళ రైల్వే ట్రాక్స్(Woman, railway tracks) పై చేసిన సాహసం చూసి అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ లోని మధుర రైల్వే స్టేషన్లో ఒక మహిళ పట్టాల మధ్య ఉన్న క్రమంలో ఒక్కసారిగా ట్రైన్ కదలడం ప్రారంభమైంది.దీంతో వెంటనే ఆ మహిళ ట్రాక్ పైనుంచి ట్రైన్ వెళ్లిపోయేంతవరకు అక్కడే పట్టాల పై పడుకొని ఉండిపోయింది.ఆ ట్రైన్ పట్టాలపై నుంచి మొత్తం వెళ్లే వరకు ఆ మహిళ అలానే పడుకొని ఉన్న కానీ ఎటువంటి ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా బయటపడింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ ఆ మహిళ ధైర్య సాహసాల గురించి కొనియాడుతూ ఉన్నారు.
ఇక మరికొందరు అయితే పట్టాలపై ట్రైన్ ఉన్న సమయంలో ఇలాంటి సాహసాలు అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.