ప్రతియేటా ప్రభుత్వాలు ఉపాధి హామీలలో భాగంగా ప్రజలకు ఉచితంగా కుట్టుమిషన్లు ఇస్తూ ఉంటాయి.ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం “ఇందిరమ్మ మహిళా శక్తి”( Indiramma Mahila Shakti Scheme ) పథకంలో భాగంగా మైనారిటీ వర్గాలకు చెందిన, అర్హులైన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను( Free Sewing Machines ) ఇచ్చే పని పెట్టుకుంది.
ఈ క్రమంలో ఆయా కార్యక్రమాన్ని తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్( TGMFC ) నిర్వహించబోతోంది.దానికోసం దరఖాస్తులు పెట్టుకోవడానికి ఆఖరి తేదీ పూర్తికాగా… తాజాగా ఆ గడువును పొడిగించింది.
ఇదివరకు గడువు తేదీ డిసెంబర్ 31 వరకే ఉండగా… చాలా మంది ఇంకా దరఖాస్తులు పెట్టుకోకపోవడంతో ప్రభుత్వం ఇప్పుడు జనవరి 20 వరకూ గడువు తేదీని పొడిగించింది.
మీలో ఎవరైనా ఇంకా దరఖాస్తు చేయకపోతే… ఆన్‌లైన్‌లో ఓపెన్ చేసి.చాలా తేలికగా అప్లై చేసుకోవచ్చు.ముందుగా దానికోసం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ లింక్ https://tgobmms.cgg.gov.in/sewingForm.action లోకి వెళ్ళవలసి ఉంటుంది.ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా మీకు డైరెక్టుగా దరఖాస్తు ఫారమ్ ఓపెన్ అవుతుంది.
ఇందులో అడిగిన వ్యక్తిగత వివరాలు, అడ్రెస్ వివరాలు, ఎటాచ్‌మెంట్స్ విభాగాలను నింపితే సరిపోతుంది.ఆ తర్వాత ప్రివ్యూ చూసి.మీరు ఇచ్చిన వివరాలు ఒకే అనుకుంటే తరువాత సబ్‌మిట్ క్లిక్ చేస్తే చాలు.ఫారమ్ వెళ్లిపోయి.
మీకు ఒక ఎక్నాలడ్జ్‌మెంట్ నంబర్ వస్తుంది.ఆ నంబర్ ద్వారా.
మీ ఫారమ్ స్టేటస్‌ని తెలుసుకోవచ్చన్నమాట.
అర్హతలు:
* మహిళకు మాత్రమే.* 5వ తరగతి పాసై ఉండాలి.* ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైనులు, పార్సీ మతాల వారు అయి ఉండాలి.* కుట్టుపని ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి.* టీజీఎంఎఫ్‌సీకి అనుబంధంగా ఉన్న సంస్థల నుంచి శిక్షణ పొందిఉండాలి.* వయస్సు 18 నుండి 55 సంవత్సరాలు కలిగి ఉండాలి.* నిరుద్యోగులు మాత్రమే అప్లై చేయాలి.* సంవత్సర ఆదాయం గ్రామాల్లో రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల కంటే తక్కువ ఉండాలి.
కావలసిన డాక్యుమెంట్స్:
* వయస్సు నిర్ధారణ పత్రం (ఆధార్ ఇవ్వొచ్చు)* అడ్రెస్ ప్రూఫ్ (ఆధార్, ఎలక్ట్రిసిటీ బిల్లు వంటివి)* చదువుకి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్* గుర్తింపు ఐడీగా ఆధార్ ఐడీ జిరాక్సు* కుట్టుపని సర్టిఫికెట్* మైనార్టీ పత్రం
.