టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలు అతి ముఖ్యమైన పండుగగా ఫీలయ్యే పండుగలలో సంక్రాంతి ముందువరసలో ఉంటుంది.ఈ సంక్రాంతి పండుగ కానుకగా ఏకంగా మూడు సినిమాలు విడుదలవుతూ ఉండగా గేమ్ ఛేంజర్,( Game Changer ) సంక్రాంతికి వస్తున్నాం,( Sankranthiki Vasthunnam ) డాకు మహారాజ్( Daaku Maharaaj ) సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
అయితే హనుమాన్ మూవీ( Hanuman Movie ) గతేడాది దాదాపుగా 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.
అయితే హనుమాన్ రికార్డ్ ను క్రాస్ చేసే సినిమా ఏది అనే చర్చ జరుగుతోంది.
ఈ మూడు సినిమాలకు రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉండగా ఏ సినిమా ఆ ఘనత సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.గేమ్ ఛేంజర్ సినిమా సులువుగానే ఈ రికార్డును బ్రేక్ చేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
గేమ్ ఛేంజర్ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాల్సి ఉంది.
డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు మాత్రం బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది.టాలీవుడ్ ఇండస్ట్రీకి సంక్రాంతి పండుగ ఎంతో కీలకం కాగా హిట్ టాక్ వస్తే సినిమాలు క్రియేట్ చేసే రికార్డులు అన్నీఇన్నీ కావు.సంక్రాంతి సినిమాలు( Sankranthi Movies ) ఇండస్ట్రీకి శుభారంభం ఇస్తే ఫ్యాన్స్ ఆనందానికి సైతం అవధులు ఉండవని చెప్పవచ్చు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.ఈ ఏడాది రిలీజ్ కానున్న ది రాజాసాబ్, వార్2, ఓజీ, హరిహర వీరమల్లు, చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీలపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.హనుమాన్ గతేడాది చిన్న సినిమాగా విడుదలై సంచలనాలు సృష్టించింది.ఈ ఏడాది మాత్రం సంక్రాంతి కానుకగా చిన్న సినిమాలేవీ రిలీజ్ కాలేదనే సంగతి తెలిసిందే.మొదట మజాకా సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుందనే ప్రచారం జరగగా ఆ ప్రచారం నిజం కాలేదు.