చక్కెర ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.మధురమైన రుచిని కలిగి ఉన్నప్పటికీ చక్కెర( Sugar ) అనేక అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది.
చక్కెర వల్ల మనకు అన్నీ నష్టాలే తప్ప ఎటువంటి లాభాలు ఉండవు.అందుకే చాలా మంది చక్కెరకు బదులుగా బెల్లం తీసుకోమని చెబుతుంటారు.
అయితే చెరుకుతోనే చక్కెర, బెల్లంను తయారు చేస్తారు.మరి చక్కెర కంటే బెల్లం( jaggery ) ఎందుకు మంచిది అని ఎప్పుడైనా ఆలోచించారా.? వాస్తవానికి బెల్లం సహజ స్వీట్నర్.శుద్ధి చేసిన చక్కెర కంటే బెల్లంలోనే ఎక్కువ పోషకాలు నిండి ఉంటాయి.
చక్కెర తయారీలో రసాయనాలు అధికంగా వాడటం వల్ల పోషక విలువలు నశించి.తీపి రుచి ఒక్కటే మిగిలిపోతుంది.అయితే బెల్లం తయారీలో మాత్రం రసాయనాలను చాలా తక్కువగా వాడతారు.అందు వల్ల బెల్లం లో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం( Iron, Calcium, Magnesium, Potassium ) వంటి మినరల్స్ తో పాటు ఎన్నో రకాల విటమిన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ నిండి ఉంటాయి.

అలాగే చక్కెరతో పోలిస్తే బెల్లం తక్కువ గ్లైసెమిక్ సూచన కలిగి ఉంటుంది.అందువల్ల బెల్లం తీసుకున్నా రక్తంలోని చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పడకుండా ఉంటాయి.బెల్లం జీర్ణ వ్యవస్థకు న్యాచురల్ క్లెన్సింగ్ ఏజెంట్ గా పని చేస్తుంది.పేగు కదలికలను మెరుగుపరుస్తుంది.కాలేయాన్ని డీటాక్స్ చేస్తుంది.

అలాగే బెల్లం యాంటీ బ్యాక్టీరియల్ ( Anti bacterial )లక్షణాలను కలిగి ఉండటం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు వేగంగా దూరం అవుతాయి.బెల్లం లో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ వివిధ రకాల దీర్ఘకాలిక జబ్బులకు దూరంగా ఉండేందుకు సహాయపడతాయి.మరియు బెల్లం రక్తహీనతను తరిమి కొడుతుంది.
మోకాళ్ల నొప్పిని దూరం చేసే ఎముకల్లో సాంద్రతను పెంచుతుంది.అందుకే పంచదారకు ప్రత్యామ్నాయంగా బెల్లంను ఎంచుకోమని చెబుతుంటారు.