భారతీయులు( Indians ) చాలా గోల చేస్తారని దగ్గరగా మాట్లాడుతారని ఇప్పటికే చాలామంది అనేక విమర్శలు చేశారు.వాటికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్( Viral Video ) అయ్యాయి.
తాజాగా @alwaysaracist అనే ట్విట్టర్ ఖాతాలో అలాంటి మరొక వీడియో పోస్ట్ అయ్యి తెగ వైరల్ అవుతోంది.కెనడాలో( Canada ) నివసిస్తున్న సాడీ క్రోవెల్( Sadie Crowell ) అనే యువతి తన ఇంటి పక్కన జరుగుతున్న ఒక భారతీయ పెళ్లిలోని( Indian Wedding ) శబ్దాల గురించి విసుక్కుంటూ ఒక వీడియో పెట్టింది.
రాత్రి పూట డప్పులు, డోల్ బీట్ల మోత హోరెత్తిస్తుంటే, “ఇదేం పెళ్లి గోల రా బాబు! నేను రాత్రంతా నిద్రపోవడానికి ట్రై చేస్తున్నా, కానీ నిద్ర పట్టలేదు.ఇప్పుడు పొద్దున్నే 9 అవుతోంది.అయినా ఇంకా ఈ పెళ్లిగోల ఆగలేదు.ఛా!” అంటూ విసుగ్గా మొహం పెట్టింది సాడీ.ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.కొందరు ఆమె తిట్టే తీరు ఫన్నీగా ఉందని పేర్కొంటున్నారు.
కొందరైతే మరీ రెచ్చిపోయారు.కెనడాలో భారతీయుల సంఖ్య పెరుగుతోందని, అందుకే ఇలాంటి శబ్ద కాలుష్యం ఎక్కువైందని వాదిస్తున్నారు.ఒక నెటిజన్ అయితే కాస్త ఘాటుగానే స్పందించాడు.“వీళ్లు ఇక్కడికి మంచిగా బతకడానికి వచ్చారు కానీ, మన దేశానికి తగ్గట్టు మారాలి కానీ, వాళ్ల గోలను ఇక్కడ రుద్దకూడదు” అని కామెంట్ చేశాడు.
ఇంకొక తెలివైన నెటిజన్ అయితే ఏకంగా కుట్ర సిద్ధాంతాన్నే బయటకు తీశాడు. “భారతీయులను ఇక్కడికి తీసుకురావడానికి ఒక ప్లాన్ ఉంది.వాళ్లను కంట్రోల్ చేయడం ఈజీ, లంచగొండితనాన్ని కూడా ఒప్పుకుంటారు.అందుకే కదా ఇండియాలో ప్రజలు మళ్లీ మళ్లీ అవినీతి నాయకుల్నే ఎన్నుకుంటారు, తర్వాత పారిపోతారు.” అంటూ తనకొచ్చిన నాలుగు ముక్కల ఇంగ్లీషులో వాగేశాడు.
కొందరు మరీ శ్రుతి మించారు.దేశం నుంచి వాళ్లను తరిమేయాలంటూ పిలుపునిస్తున్నారు.ఒక యూజర్ అయితే “మాకా” (మేక్ కెనడా గ్రేట్ ఎగైన్) అనే కొత్త పాలసీని కూడా ప్రతిపాదించాడు.“గుంపులు గుంపులుగా వలసలు అనుమతిస్తే, గుంపులు గుంపులుగా వెనక్కి పంపొచ్చు కదా?” అంటూ లాజిక్ లేని ప్రశ్న వేశాడు.ఇలాంటి కామెంట్లు చూస్తుంటే మాత్రం అసహ్యం వేస్తుంది.
అయితే చాలామంది మాత్రం ఈ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.భిన్న సంస్కృతుల మధ్య గౌరవం, సామరస్యం ఉండాలని గట్టిగా చెబుతున్నారు.సోషల్ మీడియాలో ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు రావడం బాధాకరమని అంటున్నారు.ఒకవైపు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకునేందుకు వేదికగా ఉపయోగపడుతున్న సోషల్ మీడియానే, మరోవైపు విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కూడా వాడుకుంటుండటం గమనార్హం.