ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.49
సూర్యాస్తమయం: సాయంత్రం.5.58
రాహుకాలం: మ.1.30 ల3.00
అమృత ఘడియలు: ఉ.7.33 ల9.23
దుర్ముహూర్తం: ఉ.10.00 ల10.48
మ.2.48 ల3.36
మేషం:
ఈరోజు బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.నూతన ఋణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది.వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
వృషభం:
ఈరోజు ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఉద్యోగయత్నాలు సానుకూలంగా సాగుతాయి.స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఆర్థిక పురోగతి సాధిస్తారు.ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.
వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
మిథునం:
ఈరోజు ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి.మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి.వ్యాపార విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి.దైవదర్శనాలు చేసుకుంటారు.ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
కర్కాటకం:
ఈరోజు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
సింహం:
ఈరోజు ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఇంటాబయట సమస్యలు అధికమవుతాయి.ఉద్యోగస్తుల అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
కన్య:
ఈరోజు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.దూర ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం.చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది.కుటుంబసభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి.ఆరోగ్య పరంగా కొంత శ్రద్ధ వహించాలి.
తుల:
ఈరోజు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.స్నేహితుల సహాయంతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు.సంతానానికి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.
వృశ్చికం:
ఈరోజు ఆస్తి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నలలో చిన్నపాటి అవరోధాలు ఉంటాయి.కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.వ్యాపారాల్లో అంచనాలు అందుకుంటారు.సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి.
ధనుస్సు:
ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు.కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి.ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి.
నూతన రుణయత్నాలు చేస్తారు.దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
మకరం:
ఈరోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి.దీర్ఘకాలిక ఆరోగ్యసమస్యలు మరింత చికాకు కలిగిస్తాయి.ఆస్తి వివాదాలు పరిష్కారానికి చేసే ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి.
ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి.బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.
కుంభం:
ఈరోజు ఆప్తుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.నూతన వాహనయోగం ఉన్నది.సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.పనులు చకచకా సాగుతాయి.వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది.దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు.
మీనం:
ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి.
దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది.బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.
వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహారించాలి.