టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో దర్శకుడు శంకర్ కు( Director Shankar ) మంచి గుర్తింపు ఉంది.పాన్ ఇండియా స్థాయిలో శంకర్ ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు.
అయితే గత కొంతకాలంగా శంకర్ కు సరైన సక్సెస్ లేదు.అయితే దర్శకుడు శంకర్ తాజాగా చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
తనపై వచ్చిన నెగిటివ్ కామెంట్ల గురించి శంకర్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రతి ఒక్కరూ లైఫ్ లో ఏదో ఒక సందర్భంలో విమర్శలను ఎదుర్కోవాల్సిందే అని శంకర్ వెల్లడించారు.
వాటి నుంచి ఎవరూ తప్పించుకోలేరని శంకర్ పేర్కొన్నారు.ఎవరైనా దేనికైనా విమర్శించవచ్చని ఆయన తెలిపారు.
అయితే వాటినుంచి మనం ఏం నేర్చుకున్నామనేది ముఖ్యమని శంకర్ వెల్లడించడం గమనార్హం.ఆ విమర్శలను సవాలుగా తీసుకొని తర్వాత ప్రాజెక్ట్ ను మెరుగ్గా తీయాలని శంకర్ చెప్పుకొచ్చారు.
గేమ్ ఛేంజర్ మూవీ( Game Changer Movie ) విడుదలైన తర్వాత ఇండియన్3 సినిమా( Indian 3 ) పనులను మొదలుపెడతానని శంకర్ కామెంట్లు చేయడం గమనార్హం.భవిష్యత్తులో బయోపిక్ తీస్తే రజనీకాంత్ బయోపిక్( Rajinikanth Biopic ) తీస్తానని ఆయన చెప్పుకొచ్చారు.రజనీకాంత్ గొప్ప వ్యక్తి అని ఈ విషయం ఎంతోమందికి తెలుసని శంకర్ కామెంట్లు చేశారు.నాకు ప్రస్తుతానికి బయోపిక్ తెరకెక్కించాలనే ఆలోచన లేదని శంకర్ పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఆలోచన వస్తే రజనీకాంత్ బయోపిక్ తీస్తానని ఆయన వెల్లడించడం గమనార్హం.గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్( Ram Charan ) డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు.అవినీతి సీఎం ఐఏఎస్ ఆఫీసర్ మధ్య జరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం అందుతోంది.గేమ్ ఛేంజర్ మూవీ రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.
నిర్మాత దిల్ రాజు ఈ సినిమా విషయంలో పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తున్నారు.ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని దిల్ రాజు కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు.