ఇండియన్ ట్రైన్లు( Indian Trains ) అనగానే చాలా మందికి గుర్తొచ్చేది మురికి బాత్రూమ్‌లు, చిరిగిపోయిన బెడ్‌షీట్లు.కానీ ఆగండాగండి, ఇండియన్ రైల్వేస్‌లోనూ కొన్ని లగ్జరీ రైళ్లు( Luxury Train ) ఉన్నాయి, వాటి గురించి తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.
ఈ రైళ్లలో ప్రయాణం ఒక అద్భుతమైన అనుభూతినిస్తుంది.
ఇటీవల ఆస్ట్రేలియన్ చెఫ్, కంటెంట్ క్రియేటర్ సారా టాడ్( Sarah Todd ) చేసిన ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది.
అందులో ఆమె ‘గోల్డెన్ ఛారియట్’( Golden Chariot Train ) అనే లగ్జరీ రైలు లోపలి దృశ్యాలను చూపించింది.ఇండియన్ రైల్వే ఇలాంటి అద్భుతమైన రైళ్లను కూడా నడుపుతోందా అని చాలా మంది ఆశ్చర్యపోయారు.
అంతలా ఉన్నాయి ఆ ఫీచర్లు.మేక్ ఇన్ ఇండియా( Make In India ) సత్తా సత్తా చాటింది కదా ఈ ట్రైన్ అని చాలామంది కామెంట్లు కూడా చేస్తున్నారు.
గోల్డెన్ ఛారియట్ ఒక టాప్ క్లాస్ రైలు.ఇందులో మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలూ ఉన్నాయి.అందంగా డిజైన్ చేసిన రెస్టారెంట్లు, కూర్చొని మాట్లాడుకునేందుకు ఒక సొగసైన లాంజ్ బార్, పనులు చేసుకోవడానికి బిజినెస్ సెంటర్, వ్యాయామం కోసం జిమ్, రిలాక్స్ అవ్వడానికి వెల్నెస్ స్పా ఇలా చాలానే ఉన్నాయి.
ఇక పడుకునేందుకు ట్విన్ బెడ్ క్యాబిన్లు 26, డబుల్ బెడ్ క్యాబిన్లు 17, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఒక క్యాబిన్ కూడా ఉంది.ఇది కేవలం సౌకర్యవంతమైన ప్రయాణం మాత్రమే కాదు, సౌత్ ఇండియాలోని చారిత్రక ప్రదేశాలు, అందమైన దేవాలయాలు, ప్రకృతి అందాలు, సాంస్కృతిక వారసత్వాన్ని చూసే అవకాశం కూడా కలిగిస్తుంది.
ఈ రైలులో ఒక్క రాత్రి ప్రయాణించాలంటే అంతర్జాతీయ పర్యాటకులకు కనీసం రూ.61,000 ఖర్చవుతుంది.ఐదు నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లలకు సగం ధర ఉంటుంది.
అంటే, అంత డబ్బు పెడితే మీరు దక్షిణ భారతదేశంలో ఒక రాజులా, రాణిలా ప్రయాణం చేయొచ్చన్నమాట.ఒక హిస్టారికల్ జర్నీ చేసిన ఫీలింగ్ కలుగుతుంది.
సారా వీడియో చూసిన తర్వాత చాలా మంది షాకయ్యారు, వెంటనే ఆ ట్రిప్ వేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.ఒక యూజర్ అయితే కామెంట్ చేస్తూ “ఇది నిజంగా ఒక రాయల్ వెకేషన్ లా ఉంటుంది!” అని అన్నాడు.
నిజమే కదా, గోల్డెన్ ఛారియట్ లగ్జరీ ప్రయాణానికి కేరాఫ్ అడ్రస్.ఈ అనుభూతిని అంత తేలిగ్గా మర్చిపోలేం అని చెప్పుకోవచ్చు.