చైనా కంపెనీ బీవైడీ( BYD ) ఇటీవల CES 2025లో యాంగ్‌వాంగ్ యూ9( Yangwang U9 ) అనే ఒక అదిరిపోయే సూపర్ కారును ఆవిష్కరించింది.ఆ కారు స్పెషాలిటీ ఏంటంటే, అది గుంతలు( Potholes ) ఉంటే దూకేస్తుంది, అంటే మన మనుషులం, లేదంటే ఏదైనా జంతువులు ఊరికేటప్పుడు గుంతల పైనుంచి ఎలా దూకుతాయో అలా దూకుతుంది ఇది.
వీడియోలో చూస్తే ఆ కారు ఏకంగా ఆరు మీటర్లు ముందుకు గెంతగలదు.దీనికి కారణం దానిలో ఉన్న “జంపింగ్ సస్పెన్షన్”( Jumping Suspension ) టెక్నాలజీ.
ఈ ఫీచర్ వల్ల కారు ఎత్తును మార్చుకోగలదు, రోడ్డు షాక్‌లను ఈజీగా అబ్జర్వ్ చేసుకోగలదు, ఇంకా చెప్పాలంటే అద్భుతంగా గెంతుతూ వెళ్లగలదు.
ఈ డెమో చూసిన చాలా మంది “వావ్” అని నోరెళ్ల బెడుతున్నారు.
సోషల్ మీడియాలో దీని గురించి తెగ చర్చించుకుంటున్నారు.మన ఇండియన్ నెటిజన్లు ఫుల్ జోకులు వేసుకుంటున్నారు.
మన రోడ్ల మీద గుంతలు ఎలా ఉంటాయో తెలిసిందే కదా.అందుకే ఒకాయన “ఇండియన్ రోడ్ల( Indian Roads ) కోసమే ఈ కారును తయారు చేశారు గురూ” అని కామెంట్ పెట్టాడు.ఇంకొకరు అయితే “మన రోడ్లకు ఇలాంటి కార్లు కాదు, ఏకంగా ఎగిరే కార్లే కావాలి” అని సరదాగా అన్నారు.అయితే కొందరు ప్రాక్టికల్‌గా కూడా ఆలోచించారు.ఒకతను “మరి అది ల్యాండ్ అయ్యే చోట కూడా గుంత ఉంటే ఎలా?” అని అడిగాడు.మరొకాయన “మా సిటీలో ఈ కారు కుందేలు పిల్లలా గెంతుతూ పోతుంది” అంటూ నవ్వేశాడు.
ఇదిలా ఉంటే, సీఈఎస్ 2025( CES 2025 )లో ఎక్స్‌పెంగ్ ఏరో హెచ్‌టీ( Xpeng Aero HT ) అనే మరో చైనా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ఒక కొత్త తరహా వెహికల్‌ను పరిచయం చేసింది.దాని పేరు “ల్యాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్”. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎగిరే కారు.ఒక ఎలక్ట్రిక్ మినీవ్యాన్‌లో, మడతపెట్టే eVTOL (ఎలక్ట్రిక్ వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్) ఎయిర్‌క్రాఫ్ట్ ఉంటుంది.అవసరమైనప్పుడు ఈ ఎయిర్‌క్రాఫ్ట్ విడిపోయి గాల్లోకి ఎగురుతుంది.
ఈ ల్యాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ధర 300,000 డాలర్ల కంటే తక్కువగా ఉంది, ఇప్పటికే 3,000 ప్రీ-ఆర్డర్లు వచ్చాయట.ఈ సంవత్సరం నుంచే దీన్ని భారీగా తయారు చేయడం మొదలుపెడతారు.మొదటగా చైనా మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నారు.
ఈ వెహికల్‌ను లగ్జరీ ట్రిప్పులకు కానీ, ఎమర్జెన్సీ రెస్క్యూ మిషన్లకు కానీ ఉపయోగించవచ్చు.మిగతా ఎగిరే కార్ల మోడళ్లలా కాకుండా ఇది రోడ్డు మీద డ్రైవ్ చేయడానికి, గాల్లో ఎగరడానికి రెండింటికీ పనికొస్తుంది.
యూజర్లు మినీవ్యాన్‌లో ఒక టేకాఫ్ స్పాట్‌కు డ్రైవ్ చేసి, అక్కడి నుంచి ఈవీటీఓఎల్‌ను ఆన్ చేసుకుని పక్షిలా ఎగిరిపోవచ్చు.