ప్రమోషన్స్ విషయంలో వెంకీనే తోపు.. బాలయ్య, చరణ్ నేర్చుకోవాల్సిందే!

సంక్రాంతి పండుగ సినిమాలు( Sankranti festival movies ) రిలీజ్ కు సిద్ధమయ్యాయి.ఏపీలో ఇప్పటికే గేమ్ ఛేంజర్ మూవీ ( game changer movie )బుకింగ్స్ మొదలయ్యాయి.

 Star Hero Victory Venkatesh Top In Sankranti Movies Details Inside Goes Viral In-TeluguStop.com

ఏపీలోని కర్నూలులో 215 రూపాయల నుంచి 470 రూపాయల వరకు థియేటర్ల ఆధారంగా టికెట్ రేట్లు ఉన్నాయి. డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం ( Daku Maharaju, sankranthiki vastunnam )సినిమాల బుకింగ్స్ త్వరలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

బుక్ మై షో, డిస్ట్రిక్ట్ టికెటింగ్ యాప్స్( Book My Show, District Ticketing Apps ) ద్వారా ఈ బుకింగ్స్ జరుగుతున్నాయి.

అయితే సంక్రాంతి సినిమాల ప్రమోషన్స్ విషయంలో వెంకీ మామనే తోపు అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

వెంకటేశ్ ఈ సినిమాకు కొత్తగా ప్రమోషన్స్ చేస్తూ అంచనాలు పెంచడంలో సఫలమయ్యారు.బుక్ మై షోలో ఈ సినిమాకు 2 లక్షలకు పైగా ఇంట్రెస్ట్స్ వచ్చాయి.సంక్రాంతికి వస్తున్నాం సినిమా రేంజ్ కు ఈ స్థాయిలో బుకింగ్స్ రావడం అంటే ఒక విధంగా గ్రేట్ అనే చెప్పాలి.

Telugu Show, Apps, Game Changer, Sankranti, Venkatesh-Movie

వెంకటేశ్ ( Venkatesh )తర్వాత సినిమాలతో భారీ హిట్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.వెంకటేష్ పారితోషికం 15 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు 55 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని 72 రోజుల్లో పూర్తైందని తెలుస్తోంది.

అనిల్ రావిపూడి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని సమాచారం అందుతోంది.

Telugu Show, Apps, Game Changer, Sankranti, Venkatesh-Movie

సంక్రాంతికి వస్తున్నాం మూవీ టార్గెట్ కేవలం 30 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమా సులువుగానే ఈ స్థాయిలో కలెక్షన్లను సాధించడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు.వెంకటేశ్ తర్వాత సినిమాలతో కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సైంధవ్ తో నిరాశ పరిచిన వెంకటేశ్ తర్వాత సినిమాలతో ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాల్సి ఉంది.

సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓవర్సీస్ లో, ఇతర రాష్ట్రాల్లో ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube