అక్కడ సోనూసూద్ కు 390 అడుగుల కటౌట్.. విద్యార్థులు అభిమానాన్ని చాటుకున్నారుగా!

సోనూసూద్.( Sonu Sood ) ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

 500 Students Make 390feet Sonu Sood Cutout Details, Sonu Sood, Sonu Sood 390 Fee-TeluguStop.com

ఇప్పటికే కొన్ని వేలాదిమందికి సహాయం చేసి కలియుగ కర్ణుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు సోనూసూద్‌.కరోనా సమయం నుంచి సేవా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టిన సోనుసూద్ ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు.

ప్రాంతము భాషతో సంబంధం లేకుండా కష్టం ఎక్కడ ఉంది అంటే చాలు అక్కడ వాలిపోయి వారికి నేనున్నాను అంటూ కొండంత భరోసాని ఇస్తూ ఉంటారు.అందుకే సోను సూద్ మీ దేవుడిగా భావించి చాలామంది ఫోటోలకు పూజలు కూడా చేస్తున్నారు.

ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే.

Telugu Fateh, @sonusoodarmy, Bollywood, Sonu Sood, Solapur, Sonusood-Movie

చిన్నాపెద్దా తేడా లేకుండా ఆయన్ని అందరూ అభిమానిస్తుంటారు.తాజాగా షోలాపుర్‌ లోని( Solapur ) విద్యార్థులు సోనూసూద్‌ పై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు.390 అడుగుల భారీ కటౌట్‌ ను ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారు.సోనూసూద్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఫతేహ్‌( Fateh Movie ) జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ హీరోయిన్ గా నటించింది.ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచే సుకున్న ఈ మూవీ జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో 500 మంది విద్యార్థులు 390 అడుగుల కటౌట్‌ ను సిద్ధం చేసి ఊరేగించారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

Telugu Fateh, @sonusoodarmy, Bollywood, Sonu Sood, Solapur, Sonusood-Movie

ఈ వీడియోను పంచుకున్న సోనూసూద్‌ 500 మంది విద్యార్థులు.ఒక్క ఎమోషన్‌.ఫతేహ్‌ అని క్యాప్షన్‌ పెట్టారు.ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.ఇకపోతే సోను సూచి నటించినా ఫతేహ్ సినిమా విషయానికి వస్తే.యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.

ఈ చిత్రంలో జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ మునుపెన్నడూ చేయని యాక్షన్‌ సన్నివేశాలతో ప్రేక్షకులను అలరించనుంది.నసీరుద్దీన్‌ షా, విజయ్‌ రాజ్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

సైబర్‌ మాఫియా కథ ఆధారంగా దీనిని చిత్రీకరించారు.జీ స్టూడియోస్, శక్తి సాగర్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మరో రెండు రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది.ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై అంచనాలు పెంచాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube