పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ ల కొడుకు అకీరా నందన్( Akira Nandan ) సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే గతంలో అకీరా సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.
ఆ వార్తలు అన్నీ కూడా అవాస్తవాలే అని కొట్టి పారేస్తూ వచ్చింది తల్లి రేణు దేశాయ్.అలాంటి వదంతులను నమ్మొద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది.
ఇది ఇలా ఉంటే తాజాగా రెండు మూడు రోజులుగా అకీరా నందన్ సినిమా ఇండస్ట్రీ గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా నటిస్తున్న ఓజి సినిమాతో( OG Movie ) ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ ఒక వార్త జోరుగా వినిపిస్తోంది.దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ఓజి.పవన్ అభిమానులు ఐతే మొదట ఈ సినిమాకే ఎక్కువ ప్రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు.ఇక ఈ పర్టిక్యులర్ సినిమాలో చాలా సర్ప్రైజ్ లు ఉన్నాయని టాక్ ఉంది.మరి వీటిలో పవన్ వారసుడు జూనియర్ పవర్ స్టార్ అకిరా నందన్ ఉన్నాడని ఆ మధ్య వచ్చిన బజ్ సోషల్ మీడియాని షేక్ చేసింది.
అయితే ఈ సినిమాలో అకిరా ఉన్నాడా లేదా అనే ప్రెజెన్స్ పై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) చెప్పే సమాధానం ఇపుడు ఆసక్తిగా మారింది.
చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్( Game Changer ) సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా బాలయ్య( Balayya ) క్రేజీ టాక్ షో అన్ స్టాప్పబుల్ సీజన్ 4 లో( Unstoppable Season 4 ) గెస్ట్ గా హాజరు కాగా అందులో పవన్ సినిమాలో అకిరా ఉన్నాడా లేదా అనేది తాను రివీల్ చేయనున్నాడు.అయితే దీనిపై పాజిటివ్ సమాధానమే చరణ్ నుంచి ఉంటుంది అని ఇపుడు తెలుస్తోంది.మరి చరణ్ చెప్పిన సమాధానం ఏంటో తెలియాలి అంటే ఈ జనవరి 8 సాయంత్రం 7 గంటల వరకు వేచి చూడాల్సిందే మరి.ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించి చాలా ప్రోమోలు విడుదలైన విషయం తెలిసిందే.ఫుల్ ఎపిసోడ్ కోసం అటు రామ్ చరణ్ అభిమానులు ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.