ప్రభాస్ దారిలో నడుస్తున్న అక్కినేని హీరో.. ఆ బ్యానర్ లో నటించనున్నారా?

మొన్నటి వరకు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా హర్రర్ కామెడీ జానర్ సినిమాలు విడుదల అయిన విషయం తెలిసిందే.ఈ సినిమాలను ప్రేక్షకులు కూడా బాగా ఆదరించారు.

 Naga Chaitanya New Film Update Details, Naga Chaitanya, Prabhas, The Raja Saab,-TeluguStop.com

ఇలాంటి సినిమాలు టాలీవుడ్ లో కూడా ఒక ఊపు ఊపాయి.ఇప్పుడు ఆ ట్రెండ్ మళ్లీ ఊపందుకుంటోంది.

మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) ది రాజా సాబ్( The Raja Saab ) అనే హారర్ కామెడీ ఫిల్మ్ చేస్తున్న సంగతి తెలిసిందే.అలాగే ఇప్పుడు వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో రూపొందుతోన్న సినిమా కూడా హారర్ కామెడీ జానరే.

ఇక ఇప్పుడు అదే బాటలో అక్కినేని హీరో నాగ చైతన్య( Naga Chaitanya ) పయనిస్తున్నట్లు తెలుస్తోంది.

Telugu Arka Mediaworks, Baahubali, Horror Genre, Naga Chaitanya, Nagachaitanya,

కాగా ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమా( Thandel ) చేస్తున్నాడు నాగ చైతన్య.ఈ చిత్రాన్ని చైతన్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది.ఈ మూవీ ఫిబ్రవరి 7న విడుదల కానుంది.

దీని తర్వాత విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు డైరెక్షన్ లో ఒక సినిమా ప్రకటించాడు నాగ చైతన్య.వీటితో పాటు తాజాగా మరో ప్రాజెక్ట్ సైన్ చేసినట్లు సమాచారం.

బాహుబలి ని నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్( Arka Mediaworks ) బ్యానర్ లో ఈ సినిమా రూపొందనుందట.హారర్ కామెడీ జానర్ లో ఒక నూతన దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

Telugu Arka Mediaworks, Baahubali, Horror Genre, Naga Chaitanya, Nagachaitanya,

మరి ఈ హారర్ కామెడీ ఫిల్మ్ తో చైతన్య హిట్ అందుకుంటాడేమో చూడాలి మరి.ఈ విషయంలో ప్రభాస్ ను ఫాలో అవుతున్నారు నాగచైతన్య.మరి ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అన్నది చూడాలి మరి.ఇక ప్రభాస్ సినిమా విషయంలో వస్తే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్ లో ఈ సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి.ఈ సినిమాలో హర్రర్ అలాగే కామెడీ పీక్స్ లో ఉంటుందని తెలుస్తోంది.తప్పకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube