పీరియడ్స్( periods ) అంటేనే ఆడవారిలో ఆందోళన మొదలవుతుంది.ఆ సమయంలో వచ్చే నొప్పి, రక్తస్రావం, చికాకు మానసిక కల్లోలానికి గురిచేస్తాయి.
అలాగే పీరియల్స్ లో కొందరు మహిళలు నీరసంతో బాగా ఇబ్బంది పడుతుంటారు.శరీరంలో హార్మోన్ల మార్పుల వల్ల నీరసం వేధిస్తుంటుంది.
దాని కారణంగా ఏ పని చేయాలేకపోతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ ఫుడ్స్ మీ డైట్ లో ఉండాల్సిందే.ఈ ఆహారాలు నీరాసన్ని తరమికొడతాయి.
మీ శక్తిని తిరిగి పొందడానికి సహాయపడతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

పెరుగు.నీరసాన్ని దూరం చేసి తక్షణ శక్తిని అందిస్తుంది.మీరు మీ పీరియడ్స్‌లో ఉన్నా లేకున్నా క్రమం తప్పకుండా పెరుగును తీసుకోండి.పెరుగు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.మరియు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.సిట్రస్ పండ్లు ( Citrus fruits )కూడా నెలసరి సమయంలో నీరసాన్ని తగ్గిస్తాయి.
విటమిన్ సి రిచ్‌గా ఉండే ఆరెంజ్, గ్రేప్స్, లెమన్ వంటి సిట్రస్ పండ్లను డైట్లో చేర్చుకోవడం వల్ల పీరియడ్స్‌లో ఉన్నప్పుడు మీరు చాలా త్వరగా నీరసాన్ని జయించవచ్చు.

పీరియడ్స్‌లో ఉన్నప్పుడు చాక్లెట్ తినడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు.చాక్లెట్ చాలా రుచికరమైనది మాత్రమే కాదు.అది ఎనర్జీ బూస్టర్‌గానూ పని చేస్తుంది.
ముఖ్యంగా డార్క్ చాక్లెట్ ( Dark Chocolate )ను తీసుకుంటే.ఎలాంటి నీరసాన్ని అయినా సులభంగా అణచివేయవచ్చు.
నెలసరి సమయంలో నొప్పులను, నీరసాన్ని నివారించడానికి అల్లం న్యాచురల్ మెడిసిన్‌లా పని చేస్తుంది.అందుకే పీరియల్స్ లో అల్లం టీను తీసుకునేందుకు ప్రయత్నించండి.
ఇవే కాకుండా ఆకుకూలరు, నట్స్, సీడ్స్, అరటిపండు, బెర్రీలు వంటి ఆహారాలను నెలసరి సమయంతో తీసుకోండి.ఇవి మీ శక్తిని తిరిగి అందిస్తాయి.
నీరసాన్ని తరిమికొడతాయి.ఇక వీటితో పాటు పీరియడ్స్ లో ఖచ్చితంగా రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోండి.
కనీసం 8 నుంచి పది గ్లాసుల వరకు వాటర్ ను సేవించండి.మరియు జంక్ ఫుడ్‌ను ఎవైడ్ చేయండి.