కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయటపెడతామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ టూరిస్ట్ స్పాట్ గా మార్చిందని విమర్శించారు.
ఉద్యమ పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతున్నా మౌనంగా ఉన్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.సీలేరు పవర్ ప్రాజెక్టు కోల్పోవడానికి మాజీ సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఎన్టీపీసీ ద్వారా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ పొందే హక్కు ఉందన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విభజన హక్కులను సాధించడంలో బీఆర్ఎస్ విఫలం అయిందని మండిపడ్డారు.ఈ క్రమంలోనే ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు విమర్శలు ఆపాలని సూచించారు.