క్యాస్ట్ ఐరన్ లేదా ఐరన్ కళాయిలో ( cast iron )ఇనుముతో చేసిన కళాయిని ఇలా పిలుస్తారు.ఇనుముతో చేసిన కళాయిలను పూర్వం అధికంగా వినియోగించేవారు ఇప్పుడు నాన్ స్టిక్ పాన్లు వచ్చాక వాటి వాడకం కూడా తగ్గిపోయింది.
అయినా కూడా కొంతమంది ఇళ్లలో ఇప్పటికీ మనం ఇనుము కళాయిలు చూస్తాం.వీటిల్లో అన్ని రకాల ఆహారాలు వండకూడదు.
కొన్నింటిని వండడం వలన వాటి రంగు, రుచి, ఆకృతిలో మార్పు వస్తుంది.దీని వలన కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు( Health problems ) రావచ్చు.
అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.పుల్లని పదార్థాలు చాలా ఉంటాయి.
వాటిలో ఎసిడిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది.

ఐరన్ కళాయిలో పుల్లని పదార్థాలు వండడం వలన రంగు మారిపోతుంది.ఆహారాన్ని తినడం వలన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. సీ ఫుడ్( Sea food ) కొన్ని రకాల చేపలు చాలా లేతగా, సున్నితంగా ఉంటాయి.
అలాంటి చేపలను సముద్రపు జీవులైన రొయ్యలు ( Prawns )వంటి వాటిని ఇనుపకళాయిలో అస్సలు ఉండకూడదు.వాటిని వండితే వాటికీ లోహపు రుచి వచ్చేస్తుంది.దీంతో అవి రుచిగా ఉండవు.గుడ్లతో వండే వంటకాలు, పాలు ఆధారిత వంటకాలు ఇనుపకళాయిలో వండకూడదు.
ఆమ్లెట్లు వంటివి ఇనుపకళాయిలో అస్సలు వేయకూడదు.అలాగే పాలతో చేసే పాయసాలు వంటివి కళాయిలో అస్సలు వండకూడదు.

ఇక ఇనుముల ఉండే పోర స్వభావం అందులో వండిన ఆహారాలకు వస్తుంది.దీని వలన రుచి, వాసన కూడా మారిపోతుంది.నిమ్మరసం, చింతపండు, వెనిగర్ లాంటి ఆమ్ల లక్షణాలను కలిగి ఉంటాయి.అలాగే అధిక మసాల వంటకాలను ఈ ఇనుము పాత్రలో ఉండడం వలన వాటికి రుచి రంగు మారిపోతుంది.
ఇక కొన్ని రకాల ఆకుకూరలు, పుట్టగొడుగులు వంటివి అస్సలు ఇనుప కళాయిలో వండకూడదు.అవి కళాయికి అతుక్కుపోతాయి.దీనివల్ల వాటి రంగు, రుచి, ఆకృతి మారిపోతుంది.