హెయిర్ ఫాల్ అనేది కొందరిలో చాలా అంటే చాలా తీవ్రంగా ఉంటుంది.దీంతో జుట్టు పలుచగా మారిపోతుందని కొందరు మనోవేదనకు గురవుతుంటారు.
జుట్టు రాలడాన్ని ఎలా అడ్డుకోవాలో అర్థం గాక లోలోన సతమతం అయిపోతుంటారు.మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అసలు చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే హైబిస్కస్(మందారం) షాంపూను తయారు చేసుకుని వాడితే సులభంగా మరియు వేగంగా హెయిర్ ఫాల్ కు బై బై చెప్పొచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం మందార పువ్వులతో ఎలా షాంపూను తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అరకప్పు ఎండిన ఉసిరికాయ ముక్కలు, అర కప్పు శీకాకాయి, అరకప్పు గింజ తొలగించిన కుంకుడు కాయలు వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్, వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని రెండున్నర గ్లాసుల వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు నానబెట్టుకున్న పదార్థాలను చేతి సహాయంతో స్లైట్ గా స్మాష్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నెను పెట్టుకుని అందులో నానబెట్టుకున్న పదార్థాలను వాటర్ తో సహా వేసుకోవాలి.అలాగే ఎనిమిది నుంచి పది మందార పువ్వులు, అర గ్లాస్ వాటర్ వేసుకుని కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకుంటే మన హైబిస్కస్ షాంపూ రెడీ అవుతుంది.ఈ షాంపూను వారానికి రెండు సార్లు వినియోగిస్తే జుట్టు కుదుళ్లు దృఢంగా మారతాయి.హెయిర్ ఫాల్ సమస్య నుంచి చాలా వేగంగా బయటపడతారు.అలాగే ఈ షాంపూను వాడటం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.చుండ్రు సమస్య ఉన్న సరే దూరం అవుతుంది.







