ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.06
సూర్యాస్తమయం: సాయంత్రం 06.26
రాహుకాలం:మ.3.00 సా.4.30 వరకు
అమృత ఘడియలు:ఉ.6.00 ల8.00 సా4.40 ల6.40వరకు
దుర్ముహూర్తం: ఉ.8:32 ల9.23 ల11.15 మ12.00వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు నుండి మంచి ఆదాయాన్ని పొందుతారు.స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.
వృషభం:

ఈరోజు మీరు మార్చుకునే నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.ఈరోజు మీరు కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.
మిథునం:

ఈరోజు మీరు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.మీ ఇంటికి ఈరోజు అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో చాలా ఉత్సాహంగా ఉంటారు.
కర్కాటకం:

ఈరోజు మీరు ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.
సింహం:

ఈరోజు మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.సమాజంలో గౌరవ ప్రతిష్టలను పొందుతారు.మీ కుటుంబ సభ్యులు అంతా కలిసి ఈరోజు బంధువుల ఇంటికి వెళ్తారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కన్య:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.
తులా:

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది.బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
వృశ్చికం:

ఈరోజు మీరు విందు వినోదల కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు.ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయట పడతారు.
ధనస్సు:

ఈరోజు మీరు అనారోగ్య సమస్యతో సతమతమవుతారు.దగ్గర్లో ఉన్న వైద్యుని సంప్రదించడమే మంచిది.ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవాలి.మీ చిన్ననాటి స్నేహితుడు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
మకరం:

ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.
కుంభం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం ఎక్కువగా చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.శత్రువులకు దూరంగా ఉండటమే మంచిది.
మీనం:

ఈరోజు విద్యార్థులు విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.
అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.