మనదేశంలో ఉన్న ఏ దేవాలయానికి వెళ్లిన అక్కడ ఇచ్చే ప్రసాదానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.కొన్ని దేవాలయాలలో ప్రసాదం( Prasad in temples ) అయితే ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.
మరి ఏ దేవాలయంలో ఎలాంటి ప్రసాదాన్ని భక్తులకు అందిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే తిరుమల లడ్డు ప్రసాదానికి ( Tirumala Laddu Prasad )అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉంది అని దాదాపు అందరికి తెలుసు.
ఈ రుచి ఎక్కడ దొరకదు.బూందీలో జీడిపప్పు, కిస్‌మిస్‌లు వేసి చేసే ఈ ప్రత్యేక లడ్డూను తినని వారు అస్సలు ఉండరని చెప్పవచ్చు.

ఇంకా చెప్పాలంటే భద్రాద్రి లోని రామాలయంలో పులిహోర, దద్దోజనం ప్రసాదంగా ఇస్తూ ఉంటారు.అలాగే షిర్డీ సాయినాథ్ ( Shirdi Sainath )సన్నిధిలో కోవా ప్రసాదంగా భక్తులకు అందిస్తారు.దీన్ని తీసుకోవడం పరమ పవిత్రంగా పూజలు చెబుతారు.ఇంకా చెప్పాలంటే సింహాచలం అప్పన్న దేవాలయంలో పులిహోర, దద్దోజనం ప్రసాదంగా ఇస్తుంటారు.ఇవి ఎంతో రుచిగా ఉంటాయి.శ్రీకాళహస్తిలో ( Srikalahasti )పరమాన్నం ప్రసాదంగా భక్తులకు అందిస్తారు.
ఇది ఇక్కడ ప్రత్యేకతగా భక్తులు చెబుతారు.

ముఖ్యంగా చెప్పాలంటే కేరళలోని శబరిమల అయ్యప్ప ప్రసాదం చాలా ప్రత్యేకమని దాదాపు చాలామందికి తెలుసు.బెల్లం, బియ్యం, కొబ్బరి తో వండే ఈ వంట చాలా రుచిగా ఉండడమే కాకుండా భక్తి భావం కలిగి ఉంటుంది.అలాగే అన్నవరంలో గోధుమ నూకతో ప్రసాదం తయారు చేస్తారు.
ఎలా ఆరంభించారో తెలియదు కానీ భక్తులు దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు.అలాగే పళని సుబ్రమణ్య స్వామి దేవాలయంలో ఖర్జూరం, అమృతపాణి అరటి పండ్లు, బెల్లం, నెయ్యి, యాలకులతో చేసే పంచామృతం ఎంతో అద్భుతంగా ఉంటుంది.
అలాగే తిరువనంతపురం లో గురువాయూర్ లో పాల పాయసం ఇస్తారు.దీన్ని భక్తులు మహాప్రసాదంగా సేవిస్తారు.
ముఖ్యంగా చెప్పాలంటే పూరి జగన్నాథ్ దేవాలయంలో కాజా ప్రసాదం చాలా విశిష్టతమైనది.త్రిసూర్ వడక్కునాథన్ దేవాలయంలో కొబ్బరి పూర్ణం ప్రసాదంగా అందిస్తారు.
అంతటి తీపి పదార్థంపై ఈగలు అసలు వాలవాని పూజారులు చెబుతున్నారు.