గుడిలో గంటలను ఎందుకు అమరుస్తారో తెలుసా..?

మన దేశ వ్యాప్తంగా ఎన్నో పురాతనమైన దేవాలయాలు ( Temples )ఉన్నాయి.ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటాయి.

 Do You Know Why Bells Are Kept In The Temple ,temples, Bells ,skanda Purana,-TeluguStop.com

మన దేశంలో ఉన్న ఒక్కొక్క దేవాలయాలలో ఒక్కొక్క రకమైన పూజలు, ప్రసాదాలు చేస్తూ ఉంటారు.దాదాపుగా ప్రతి ఆలయంలోనూ ఖచ్చితంగా అందరికీ కనిపించేలా పెద్ద పెద్ద గంటలను అమరుస్తూ ఉంటారు.

అందుకే గుడికి వచ్చిన భక్తులందరూ గంట ద్వారా శబ్దం చేస్తూ ఉంటారు.అన్ని రకాల వాస్తు దోషాలు( Vastu Doshas ) కూడా గంట మోగించడం ద్వారా తొలగిపోతాయని చాలామంది భక్తులు నమ్ముతారు.

ముఖ్యంగా చెప్పాలంటే గంట శబ్దం క్రమం తప్పకుండా ఎక్కడ వస్తుందో అక్కడ వాతావరణం ఎప్పుడు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, పవిత్రంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు.

స్కంద పురాణం( Skanda Purana ) ప్రకారం గుడిలో గంట మోగించడం వల్ల భక్తుల వంద జన్మల పాపాలు తొలగిపోతాయని వేద పండితులు చెబుతూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే గంట మోగించడం ద్వారా దేవతల ముందు మీ హాజరు పడుతుందని చాలామంది చెబుతారు.గంట శబ్దం కంపనాలు వాతావరణంలో వ్యాపించిన బ్యాక్టీరియా, వైరస్లు( Bacteria, viruses ) మొదలైన వాటిని నాశనం చేస్తాయి అని చెబుతూ ఉంటారు.

లయబద్ధమైన గంట శబ్దం మనసు మనసు నుండి ఉద్విగ్యతను తొలగించి శాంతినిస్తుంది.

అంతే కాకుండా నిరంతరం గంటను మోగించడం ద్వారా ప్రతికూల శక్తులు తొలగిపోతాయని వేద పండితులు చెబుతారు.కాలచక్రానికి ప్రతికగా గంటను చాలామంది ఈ భావిస్తారు.ఆలయంలోని దేవతలకు పూజ అయిపోయిన తర్వాత గంటను మోగించడం హారతినిస్తారు.

అలాగే మన దేశవ్యాప్తంగా చాలామంది ప్రజలు తమ ఇంట్లో కూడా పూజలు చేసి హారతి ఇచ్చేటప్పుడు గంటను మోగిస్తూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube