మన తెలుగు భారతీయులు తులసిని అమ్మవారిగా కొలుస్తారు.ఇక పెళ్లైన మహిళలు సుమంగళిగా ఉండాలని తులసికి ఎప్పుడు పూజలు చేస్తూ ఉంటారు.
ఇక తులసి మొక్కను పూజించడం వలన లక్ష్మీదేవి( Goddess Lakshmi ) అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్ముతుంటారు.అందుకే హిందువుల ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది.
ఇక కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో తులసి మొక్కను ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు.అయితే తులసి మొక్కను పూజించే సమయంలో కొన్ని రకాల పొరపాటులను అస్సలు చేయకూడదు.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తులసి మొక్కను ప్రతి గురువారం( Thursday ) రోజు ప్రత్యేకించి పూజించడం వలన అదృష్టం వస్తుందని వేద పండితులు చెబుతున్నారు.ఇక డబ్బులతో మీ ఖజానా నిండిపోతుంది.తులసి మొక్కకు విశిష్టత ఉంది.
అందుకే ప్రతి ఒక్కరు కూడా తులసి మొక్కకు పూజలు చేస్తూ ఉంటారు.ప్రతి ఇంట్లో తులసి మొక్క తప్పకుండా పెంచుకుంటారు.
ఇక ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పూజలు చేసి నీరు అభిషేకిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం లభిస్తుందని అలాగే సుఖసంతోషాలు కలిగేలా చేస్తుందని భక్తుల విశ్వాసం.అయితే మామూలుగా ఏ నెలలో అయినా కూడా శుక్లపక్షం గురువారం రావి చెట్టు దగ్గరికి వెళ్లి నాలుగు ఆకులను తీసుకుని వాటికి చందనం లేపనం రాసి నదిలో వదిలేయాలి.

ఇలా చేయడం వలన మీకు సంపద లభిస్తుంది.అదేవిధంగా గురువారం రోజు పుణ్యా నక్షత్రంలో గోరోచనాన్ని వెండి డబ్బాలో ఉంచి ధూపం వదిలి సింధూరం పెట్టి ఖజానాలో ఉంచాలి.ఇలా చేయడం వలన డబ్బులకు కొదవ అసలు ఉండదు.అలాగే ప్రతి గురువారం నాడు తులసి మొక్కకు( Tulasi Puja ) పాలు పోయడం వలన ఆ ఇంట్లో ధన సంపదలు పెరిగిపోతాయి.
ఇక ప్రతి గురువారం పసుపు గుడ్డను తీసుకొని తులసి మొక్క చుట్టూ ఉండే గడ్డిని తీసుకొని ఆ గుడ్డలో చుట్టి ఖజానా దాస్తున్న దగ్గర ఉంచితే, ఇక మీకు డబ్బుకు లోటు ఉండదు.