పురుషోత్తమ మాసంలో చేసే పూజలకు, దానాలకు అధిక పుణ్యఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.హిందూ సనాతన ధర్మం ప్రకారం ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది.
మాస వైశిష్ట్యం గురించి పురాణాలలో అనేక విషయాలు తెలియజేశారు.అయితే పురాణాల ప్రకారం మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసము పురుషోత్తమ మాసం అనీ స్వయంగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి( Lord vishnu ) చెప్పినట్లుగా పురాణాలలో ఉంది.
జ్యోతిష్య శాస్త్రం( Astrology) ప్రకారం అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు.పురుషోత్తమ మాసంలో విష్ణువు ఆరాధన, భగవత్ ఆరాధన తప్ప మరొక కార్యక్రమాన్ని ఆచరించకూడదు.ఆధ్యాత్మిక చింతన కలవారు మహావిష్ణువును పూజించేటటువంటి వారు పురుషోత్తమ మాసం( Purushottam Masa ) కోసం వేచి చూస్తారని శాసనాలు తెలియజేశాయి.ఈ మాసంలో భగవత్ ఆరాధనలు విష్ణు సహస్రనామము వంటివి పారాయణ చేయడం, యజ్ఞ యాగాదులు, ఏకాదశి ఉపవాసాలు, వ్రతాలు జపతాపా సమాధులు, దాన ధర్మములు వంటివి ఆచరించాలి.
మూలు మాసంలో ఇవి ఆచరిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో దానికంటే కొన్ని వేల రేట్లు అధిక పుణ్య ఫలము ఈ పురుషోత్తమ మాసంలో వస్తాయని స్వయంగా శ్రీమహావిష్ణువు చెప్పినట్లు పండితులు చెబుతున్నారు.పురుషోత్తమ మాసాన్ని జ్యోతిషా శాస్త్రము అధికమాసముగా, మాల మాసముగా, శూన్య మాసముగా పరిగణించబడింది.
అందుచేత పురుషోత్తమా మాసంలో వివాహము, గృహప్రవేశం, గృహారంభము, గర్భాదానము వంటి శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
ఈ పురుషోత్తమ మాసంలో మహావిష్ణువును పూజించడం, అష్టదశ పురాణాలను పఠించడం రామాయణం, మహాభారతం వంటివి చదవడం, విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత వంటివి చదువుకోవడం వల్ల విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే ఈ మాసంలో నవధాన్యాలను దానం ఇవ్వడం వల్ల గ్రహ దోషాలతో దూరమైపోతాయి.ఈ పురుషోత్తమ మాసములో శనగలతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా పంచిపెట్టడం వల్ల బృహస్పతి యొక్క అనుగ్రహం కలుగుతుంది.
ఈ పురుషోత్తమ మాసంలో అన్నదానం, వస్త్ర దానం, గోదానం వంటి దానాలు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
DEVOTIONAL