సినీ ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం.సాధారణ ప్రజలు సినీ స్టార్స్‌ని చూసి వారిలా జీవించాలని ఆశపడుతుంటారు.
కానీ ఆ సినీ సెలబ్రిటీల జీవితంలో జరిగే చీకటి నిజాల గురించి ఎవరూ ఆలోచించరు.బయట ప్రపంచానికి సినీ పరిశ్రమ( Cinema Industry ) చాలా అందంగా కనపడుతుంది కానీ దాంట్లో ఉన్న సమస్యల గురించి అందులో ఉన్న వారికే తెలుస్తుంది.
ముఖ్యంగా మద్యపానాన్ని( Alcohol ) వ్యసనంగా చేసుకొని ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు కెరీర్ ని నాశనం చేసుకున్నారు.మరికొందరు మాత్రం ఆ అలవాటు మాని మళ్లీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగారు.
అలా సినిమాల కోసం ఆల్కహాల్‌కు అలవాటు పడి ఆ తరువాత దాని నుంచి బయటపడిన సినీ ప్రముఖుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సౌత్ సినీ ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రజనీకాంత్( Rajinikanth ) గతంలో ధూమపానం, మద్యపానానికి బానిస అయ్యి కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు.
కానీ ఆయన భార్య కారణం గా ఆ వ్యసనాలను వదిలిపెట్టి ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ గా ఎదిగాడు.ఈ విషయాన్ని స్వయంగా రజనీకాంత్ పలు ఇంటర్వ్యూలలో చెప్పారు.

ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో ధర్మేంద్ర( Dharmendra ) మద్యపాన వ్యసనంతో ఎన్నో ఏళ్ళు తన కెరీర్ ని పాడుచేసుకున్నాడు.ఇక ఇప్పుడు దానినుండి బయట పడి మళ్లీ సినిమాలో రాణిస్తున్నాడు.బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మనీషా కోయిరాల( Manisha Koirala ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఒకప్పుడు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన ఈ అమ్మడు మద్యం మత్తులో కెరీర్ పోగొట్టుకుంది.
అయితే ఆ వ్యసనమే ఆమె జీవితాన్ని మలుపుతిప్పిందని చాలా సందర్భాలలో చెప్పింది.

బాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్న సమయంలో సంజయ్ దత్( Sanjay Dutt ) డ్రగ్స్, లిక్కర్‌కు అలవాటుపడి కెరీర్ పాడుచేసుకున్నాడు.ఆ తరువాత రీహబిలిటేషన్ సెంటర్ కి వెళ్లి ఆ చెడు వ్యసనాల నుంచి బయటకు వచ్చాడు.ప్రస్తుతం సంజయ్ దత్ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విలన్ గా పేరు తెచ్చుకున్నాడు.
బాలీవుడ్ స్టార్ హీరో ఫర్ధిన్ ఖాన్( Fardeen Khan ) చాలా సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించాడు.ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంటున్న సమయంలోనే ఆల్కహాల్‌కు బానిస అయ్యి కెరీర్ నాశనం చేసుకున్నాడు.
ఇక ఇప్పుడు తిరిగి సినిమాలలో నటించడానికి రెడీ అవుతున్నాడు.ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ కూతురు, బాలీవుడ్ అందాల తార పూజ భట్( Pooja Bhatt ) గురించి అందరికి తెలిసిందే.
ఆమె ఆల్కహాల్‌కి అడిక్ట్ అయ్యి కెరీర్ పాడు చేసుకుంటున్న సమయంలో మహేష్ భట్ ఆమెని మద్యం నుండి దూరం చేసాడు.