సోమవారం రోజు శివుని ఆరాధన చేయడానికి మంచి రోజు అని చాలామందికి తెలుసు.అందుకోసం వారు సోమవారం ఉపవాసం ఉండి మహా శివుని పూజిస్తూ ఉంటారు.
తెల్లవారుజామున నుంచి శివాలయాలకు, గోపురాలకు భక్తులు పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్తారు.సోమవారం రోజు ప్రజలు శివలింగానికి నీటిని సమర్పిస్తారు.
మహా శివుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు వివిధ మార్గాల్లో పూజలు చేస్తూ ఉంటారు.అంతేకాకుండా వివాహం కాని అమ్మాయిలు సోమవారం ఉపవాసం ఉంటే మంచి వరుడు లభిస్తాడని చాలామంది ప్రజలు నమ్ముతారు.
కానీ కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల వివాహంలో కొన్ని సమస్యలు రావడం ప్రారంభమవుతాయి.వివాహం ఆలస్యమవుతుందంటే సోమవారం కొన్ని పరిహారాలు చేయాలి.
ఆ పరిహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.కోరుకున్న భాగస్వామిని పొందడానికి వివాహ పంచమి రోజున ఈ పని చేయడం వల్ల కోరుకున్న భాగస్వామి నీ పెళ్లి చేసుకోవచ్చు.
అంతేకాకుండా వైవాహిక జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది.వైవాహిక జీవితంలో ఏ సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి.సోమవారం తొందరగా వివాహానికి ఈ పరిహారాలు చేయడం మంచిది.పెళ్లి కానీ అమ్మాయిలు సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి తల స్నానం చేయాలి.
అలాగే ఓం నమః శివాయ’ అని కూడా చదవాలి.ఇంకా చెప్పాలంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం వీలైన వారు ఆ రోజు పసుపు లేదా తెల్లని దుస్తులను ధరించి చెప్పులు లేకుండా దేవాలయానికి వెళ్లడం మంచిది.

అప్పుడు దేవాలయంలో శివునితో పాటు గణేషుడు, తల్లి పార్వతి, నంది మరియు కార్తికేయుని కూడా పూజించాలి.కొన్ని ధార్మిక గ్రంథాల ప్రకారం సోమవారం నాడు పార్వతి తల్లిని శివునితో కలిపి పూజించడం వల్ల వివాహం త్వరగా జరగడం కాకుండా వైవాహిక జీవితంలో వచ్చే కొన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.ఇంకా చెప్పాలంటే సోమవారం రోజు పూజా సమయంలో 108 ఆకులను తీసుకొని ప్రతి ఆకుపై గంధంతో శ్రీరాముడు అని రాసి ఆ తర్వాత శివలింగానికి ఒక్కొక్కటిగా ఆకులను సమర్పించాలి.ప్రతి సోమవారం ఇలా చేయడం వల్ల మీ వివాహం త్వరగా జరుగుతుంది.