FIFA World Cup doha : ఆ స్టేడియం FIFA వరల్డ్ కప్ తర్వాత ఇక కనబడదా? ఏం జరగబోతోంది?

స్వార్వభౌమాధికారం కలిగిన దేశం ఖతార్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ 2022 షురూ అయిన సంగతి విదితమే.ఇక్కడ నేడు రౌండ్ 16 మ్యాచ్‌లు పోటాపోటీగా సాగుతున్నాయి.మ్యాచ్‌లన్నీ 7 కొత్త స్టేడియాల వేదికగా జరుగుతున్నాయని మీకు తెలుసా? ఇకపోతే ఈ స్టేడియాల్లో ఒకటైన ‘స్టేడియం 974’ వేదికను దోహా అనే నగరంలో చాలా హంగులతో విభిన్నంగా నిర్మించారు.40 వేల మంది వీక్షకులు మ్యాచ్ చూసే సామర్థ్యమున్న ఈ స్టేడియం అనేకమంది దిగ్గజ క్రీడాకారులు, ప్రేక్షకులు ఫేవరేట్ అని చెబుతూ వుంటారు.

 Will That Stadium Disappear After The Fifa World Cup What Is Going To Happen-TeluguStop.com

అయితే అలాంటివారికి ఇది చేదు వార్తనే చెప్పుకోవాలి.తాజా టోర్నమెంట్ ముగిసిన తర్వాత అంతటి ఘన చరిత్ర కలిగిన దానిని కూల్చివేయనున్నారు.స్టీల్, షిప్పింగ్ కంటెయినర్స్ సహా రీసైకిల్డ్ మెటీరియల్స్‌తో దీనిని పాక్షికంగా నిర్మించడమే దీనికి కారణం అని తెలుస్తోంది.టోర్నీ ముగిశాక స్టేడియాన్ని పూర్తిగా కూల్చివేయనున్నట్టు నిర్వాహకులు తాజాగా ఓ మీడియా వేదికగా చెప్పారు.

తరువాత మెటీరియల్స్‌ను వేరుచేయనున్నట్టు చెప్పారు.కాగా ‘స్టేడియం 974’ డిజైన్, మౌలిక సదుపాయాలపై ఖతార్‌తోపాటు ఇతర దేశాలకు చెందిన నిపుణులకు అప్పట్లో ప్రశంసలు దక్కాయి.

Telugu Awards, Doha, Fifa, Qatar, Latest-Latest News - Telugu

కాగా నేడు దాని లైఫ్ టైం దగ్గర పడటంతో ఇలా చేయక తప్పడంలేదని అన్నారు.సుస్థిరాభివృద్ధి అనే ప్రాథమిక సూత్రం ఆధారంగా ఈ స్టేడియం నిర్మాణం అప్పడు జరిగిందని కూడా చెప్పుకొచ్చారు.అలాగే దాన్ని కూల్చిన పిదప విడిభాగాలను వేరు చేసేవిధంగా నిర్మించినట్టు చతమ్ హౌస్ కంపెనీ అసోసియేట్ అయిన కరీం ఎల్గెండీ పేర్కొన్నారు.‘స్టేడియం 974’ నిర్మాణానికి 974 కంటెయినర్లను ఉపయోగించడం వలన దానికి ఆపేరు పెట్టారట.

అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమంటే ఖతార్ డయలింగ్ కోడ్ కూడా 974 కావడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube