ఆ స్టేడియం FIFA వరల్డ్ కప్ తర్వాత ఇక కనబడదా? ఏం జరగబోతోంది?

స్వార్వభౌమాధికారం కలిగిన దేశం ఖతార్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ 2022 షురూ అయిన సంగతి విదితమే.

ఇక్కడ నేడు రౌండ్ 16 మ్యాచ్‌లు పోటాపోటీగా సాగుతున్నాయి.మ్యాచ్‌లన్నీ 7 కొత్త స్టేడియాల వేదికగా జరుగుతున్నాయని మీకు తెలుసా? ఇకపోతే ఈ స్టేడియాల్లో ఒకటైన ‘స్టేడియం 974’ వేదికను దోహా అనే నగరంలో చాలా హంగులతో విభిన్నంగా నిర్మించారు.

40 వేల మంది వీక్షకులు మ్యాచ్ చూసే సామర్థ్యమున్న ఈ స్టేడియం అనేకమంది దిగ్గజ క్రీడాకారులు, ప్రేక్షకులు ఫేవరేట్ అని చెబుతూ వుంటారు.

అయితే అలాంటివారికి ఇది చేదు వార్తనే చెప్పుకోవాలి.తాజా టోర్నమెంట్ ముగిసిన తర్వాత అంతటి ఘన చరిత్ర కలిగిన దానిని కూల్చివేయనున్నారు.

స్టీల్, షిప్పింగ్ కంటెయినర్స్ సహా రీసైకిల్డ్ మెటీరియల్స్‌తో దీనిని పాక్షికంగా నిర్మించడమే దీనికి కారణం అని తెలుస్తోంది.

టోర్నీ ముగిశాక స్టేడియాన్ని పూర్తిగా కూల్చివేయనున్నట్టు నిర్వాహకులు తాజాగా ఓ మీడియా వేదికగా చెప్పారు.

తరువాత మెటీరియల్స్‌ను వేరుచేయనున్నట్టు చెప్పారు.కాగా ‘స్టేడియం 974’ డిజైన్, మౌలిక సదుపాయాలపై ఖతార్‌తోపాటు ఇతర దేశాలకు చెందిన నిపుణులకు అప్పట్లో ప్రశంసలు దక్కాయి.

"""/"/ కాగా నేడు దాని లైఫ్ టైం దగ్గర పడటంతో ఇలా చేయక తప్పడంలేదని అన్నారు.

సుస్థిరాభివృద్ధి అనే ప్రాథమిక సూత్రం ఆధారంగా ఈ స్టేడియం నిర్మాణం అప్పడు జరిగిందని కూడా చెప్పుకొచ్చారు.

అలాగే దాన్ని కూల్చిన పిదప విడిభాగాలను వేరు చేసేవిధంగా నిర్మించినట్టు చతమ్ హౌస్ కంపెనీ అసోసియేట్ అయిన కరీం ఎల్గెండీ పేర్కొన్నారు.

‘స్టేడియం 974’ నిర్మాణానికి 974 కంటెయినర్లను ఉపయోగించడం వలన దానికి ఆపేరు పెట్టారట.

అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమంటే ఖతార్ డయలింగ్ కోడ్ కూడా 974 కావడం విశేషం.

మీరు చింతచిగురు ఎప్పుడైనా తిన్నారా? దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వెంటనే తింటారు..!