ప్రస్తుత కాలంలో చాలామంది భార్య భర్తలు చిన్నచిన్న కారణాలవల్ల విడిపోతున్నారు.ఇలా విడిపోకుండా వీరు జీవితాంతం ఎంతో సంతోషంగా అన్యోన్యంగా ఉండాలంటే ఇలాంటి వాస్తు నియమాలను కచ్చితంగా పాటించాల్సిందే.
వాస్తు ప్రకారం ఇంట్లోనే కొన్ని సామాన్లను ఎప్పుడు సర్దుకుంటూ ఉంటాం.వాస్తుకు వ్యతిరేకంగా ఏమైనా సామాన్లు ఉంటే ఆ ఇంటికి అంత మంచిది కాదు.
అంతేకాకుండా చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.ఆ సమస్యలలో ముఖ్యంగా ఆదాయం తగ్గడం, ధన నష్టం, లాంటి చెడు జరుగుతుందని చాలామంది నమ్ముతారు.
అయితే వాస్తు పండితులు భార్యాభర్తల మధ్య సమస్యలు ఉండకూడదు అంటే కొన్ని ముఖ్యమైన విషయాలను పాటించాల్సిందే అని చెబుతున్నారు.ఈ నియమాలను కనుక భార్యాభర్తలు అనుసరిస్తే వారి మధ్య సమస్యలు తగ్గిపోయే అవకాశం ఉంది.
ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.వాస్తు శాస్త్రం ప్రకారం భార్యాభర్తల మధ్య గొడవ రాకుండా ప్రేమతో జీవితాంతం ఉండాలంటే భార్యాభర్తల బెడ్ రూమ్ లో చాలా శుభ్రంగా ఉండాలి.
ఇంకా చెప్పాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్ బాగా ఉండాలంటే కొవ్వొత్తులు, పువ్వులు కూడా ఎంతో ఉపయోగపడతాయి.పగిలిపోయిన, విరిగిపోయిన పరికరాలను పడక గదిలో ఉంచడం వల్ల ఆ ఇంటిలోకి నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది.
దీనివల్ల ఆ ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ బయటికి వెళ్లే అవకాశం కూడా ఉంది.పడకగది నైరుతి దిశలో ఉండడం అంత మంచిది కాదు.

నైరుతి వైపు ఉండి మాట్లాడడం కూడా అంతా మంచి విషయం కాదు.దీనివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.వాస్తు శాస్త్రం ప్రకారం సింక్ మరియు స్టౌ ఒకే దిక్కున ఉండకూడదు.ఎప్పుడు కూడా నీళ్లు నిప్పు వేరుగా ఉండడమే మంచిది.ఇలా ఉండడం వల్ల కూడా భార్య భర్తల మధ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది.