Sri Reddy Chiranjeevi : విషపురుగు గాడు అంటూ చిరంజీవి పై రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్న శ్రీరెడ్డి?

తెలుగు సినీ ప్రేక్షకులకు వివాదాస్పద నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తరచూ ఏదోక వివాదంతో ఎవరో ఒకరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది శ్రీ రెడ్డి.

 Is Sri Reddy Commenting On Chiranjeevi By Calling Him vishapuruga Gadu, Sri Red-TeluguStop.com

ఇక మెగా ఫ్యామిలీ పై తరచూ ఎవరో ఒకరిపై విమర్శలు చేస్తూనే ఉంటుంది.ఇటీవల నాగబాబు పై ఒక రేంజ్ లో విరుచుకుపడుతూ బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయిన శ్రీరెడ్డి తాజాగా మెగాస్టార్ చిరంజీవి పై అనుచిత వ్యాఖ్యలు చేసింది.

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తాను చదువుకున్న నరసాపురం కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న విషయం మనందరికీ తెలిసిందే.అయితే మెగాస్టార్ చిరంజీవి అతిథిగా హాజరవ్వడం కోసమే నరసాపురంలో జరగాల్సిన ఆ కార్యక్రమాన్ని హైదరాబాదులోని ఖైరతాబాద్ లో నిర్వహించారు.

ఇక ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి తన పాత అనుభవాల గురించి అలాగే రాజకీయాల గురించి పలు ఆసక్తి గల వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ రాజకీయాల్లో రాణించాలి అంటే రాటు తేలి ఉండాలని అనడానికైనా అనిపించుకోవడానికి అయినా సిద్ధంగా ఉండాలి అని చెప్పుకొచ్చారు.

అయితే నేను రాజకీయాలలో అంతగా రాణించలేకపోయాను కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అనడానికి అనిపించుకోవడానికి రెండింటికి సిద్ధంగా ఉన్నాడని మీ అందరి ఆశీస్సులతో ఏదో ఒక రోజు పవన్ మంచి స్థానంలో నిలబడతాడు అని తెలిపారు చిరంజీవి.ఇదే విషయంపై శ్రీ రెడ్డి మండిపడుతూ చిరంజీవి పై ఒక రేంజ్ లో విరుచుకు పడింది.

Telugu Chiranjeevi, Pawan Kalyan, Sensational, Sri Reddy, Tollywood-Movie

ఈ క్రమంలోనే ఫేస్బుక్లో ఒక పోస్టును కూడా చేసింది.ఈ పక్కనున్నాడు దొంగ బాడకవ్ అని ఎప్పుడో చెప్పాను విన్నారా జగనన్న.వీడు ఇప్పుడు తొందరపడి ముందే కూసాడు.ఫ్యూచర్ తెలియక శృతి కూడా మార్చాడు ఈ వెధవ.పీకే గాడు పెద్ద నాయకుడు అవుతాడట.ఇంకొకసారి ఈ విషపురుగు గాడు మీ పక్కన నిలబడడం నేను చూడకూడదు అంతే ఇట్స్ మై ఆర్డర్ అని నేను చెప్పే అంత సీన్ నాకు లేదు కానీ ఆర్డర్ నే అంటూ రాసుకు వచ్చింది.

అయితే మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలపై శ్రీ రెడ్డి ఈ విధంగా స్పందిస్తూ మెగాస్టార్ పై ఒక రేంజ్ లో విరుచుకుపడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube