సాధారణంగా నలభై పైబడిన తరువాత కంటి చూపులో తేడాలు వస్తుంటాయి.కానీ, నేటి కాలంలో చాలా మందికి అతి చిన్న వయసులోనే కంటి చూపు మందగిస్తోంది.
కంటి చూపు మందగించడానికి చాలా కారణాలే ఉన్నాయి.విలమిన్ ఎ లోపం, అతిగా ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు చూడడం, పోషకాహార లోపం, ఇతర అనారోగ్య సమస్యల వల్ల కంటి చూపు మందగిస్తుంటుంది.
అయితే కంటి చూపు విషయంలో మొదటి నుంచే జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.లేదంటే పూర్తిగా కంటి చూపును కోల్పోయే అవకాశాలు పెరిగిపోతాయి.
మరి కంటి చూపు మెరుగుపడాలంటే ఏం చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.కంటి చూపు మెరుగుపడాలంటే.ముందుగా ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి.కంటి చూపు మెరుగుపరిచే విటమిన్ ఎ క్యారెట్‌లో పుష్కలంగా ఉంటుంది.
కాబట్టి, ప్రతి రోజు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ లేదా రోజుకో క్యారెట్ తీసుకోవాలి.ముదురు ఆకుపచ్చటి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.

ముఖ్యంగా పాలకూర, మెంతి కూర, తోటకూర, గ్రీన్ కాప్సికమ్, బ్రోకలీ, జామపండ్లు, ఉసిరి వంటివి డైట్‌లో చేర్చుకోవాలి.వీటి వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేపలను వారానికి కనీసం ఒకసారైన తినాలి.గుడ్డు, పాలు, పెరుగు ఖచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలి.ప్రతి రోజు కనీసం మూడు లీటర్ల నీరు తీసుకోవాలి.అలాగే రోజుకు కనీసం ఇరవై నిమిషాలు అయినా వ్యాయామాలు చేయాలి.
ధూమపానికి దూరంగా ఉండాలి.ఎందుకంటే. పొగతాగడం వల్ల దీర్ఘకాలంలో కంటిచూపు దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇక ప్రతి రోజు ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు ఖచ్చితంగా నిద్రపోవాలి.
అలాగే మీరు వర్క్ చేసే సమయంలో.నిరంతరం మీ కళ్ళు రెప్పలు మూసి తెరవటం చేయండి.
తద్వారా కంటి అలసట పోయి.చురగ్గా పని చేస్తాయి.
ఇలాంటి చిన్ని చిన్న టిప్స్‌ను ఫాలో అయితే.కంటి చూపు మెరుగుపడుతుంది.