కృష్ణా జిల్లా యనమలకుదురులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.యనమలకుదురు బ్రిడ్జిపై ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనే నిరసన కార్యక్రమాన్ని టీడీపీ నేతలు చేపట్టారు.
ఈ క్రమంలో టీడీపీ నిరసనను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు.టీడీపీ కార్యకర్తలను అక్కడ నుంచి పంపించివేయాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశారు.
అనంతరం నిరసనకారులపైకి దూసుకొచ్చారు.రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకున్నారు.
రెండు పార్టల కార్యకర్తలు భారీగా మోహరించడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.