Bhagavad Gita : చెడు ఆలోచనలకు అలాంటి ఆహారమే కారణమా..? భగవద్గీత ఏం చెబుతోంది..?

ఆరోగ్యం తీసుకునే ఆహారంపై( Food ) ఆధారపడి ఉంటుంది.పోషకాహారం తింటే ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు.

 What Does Bhagavad Gita Says About The Food You Eat-TeluguStop.com

జంక్ ఫుడ్ తింటూ అనారోగ్యాలకు కూడా ఆహ్వానం పలికినట్లు ఉంటుంది.ఒక వ్యక్తిని సమూలంగా మార్చుతుంది.

అందుకే ఏమి తింటున్నారు అన్నది, మీరు అనే మాట చాలా మంది నోట వినిపిస్తుంది.నిజానికి ఇదే సూత్రం ఉపనిషత్తులు, భగవద్గీత, పతంజలి యోగ సూత్రాల్లో కూడా కనిపిస్తుంది.

అయితే ఆరోగ్యం, ఆనందాన్ని సాధించడానికి బ్యాలెన్స్ లైఫ్ స్టైల్ పాటించాలని గ్రంథాలు కూడా చెబుతున్నాయి.భగవద్గీతలోని( Bhagavad Gita ) ఆరవ అధ్యాయం, శ్లోకం 17, ఈ సుతాన్ని కచ్చితంగా ప్రతిబింబిస్తుంది.

Telugu Arjuna, Bhagavad Gita, Healthy, Rajasic, Sattvic Foods, Sri Krishna, Tama

భగవద్గీతలో శ్రీకృష్ణుడు, అర్జునుడిని ఉద్దేశించి సమతుల్య ఆహారం, క్రమశిక్షణతో కూడిన చర్యలు, చక్కటి నిద్రతో కూడిన జీవితం బాధలనుండి విముక్తి కలిగిస్తుందని సలహా ఇస్తాడు.ఆహారం ఒకరి స్వభావం, చర్యలను ఎలా ప్రభావితం చేసిందనే దానిపై కూడా భగవద్గీత ఒక మంచి వివరణ ఇచ్చింది.భగవద్గీత మూడు గుణాలను పరిచయం చేస్తుంది.అవి అవి సాత్విక,( Sattvic ) రాజస,( Rajasic ) తామస.( Tamasic ) ఈ గుణాలు మానవులలో వ్యక్తం అయ్యే స్వభావిక లక్షణాలు, ఆహార ఎంపికలలో కూడా ఈ గుణాలు ఉంటాయి.అయితే తినే ఆహారాన్ని బట్టి ప్రజల్లో, ఈ గుణాల్లో ఏదో ఒక గుణం కనిపిస్తుంది.

Telugu Arjuna, Bhagavad Gita, Healthy, Rajasic, Sattvic Foods, Sri Krishna, Tama

అయితే సాత్విక ఆహారాలను స్వచ్ఛమైనవిగా కూడా పరిగణిస్తారు.జ్ఞానోదయం, శాంతి, సంతృప్తి కూడా ప్రోత్సహిస్తాయి.అంతేకాకుండా ఆరోగ్యం, పుణ్యం, ఆనందం, సంతృప్తి, దీర్ఘాయువును కూడా ప్రసాదిస్తాయి.అంతేకాకుండా ధాన్యాలు, పప్పులు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, ఇతర మొక్కల ఆధారిత పదార్థాలు సాత్విక ఆహారాల కిందకి వస్తాయి.

అయితే ఈ ఆహారాలు జ్యూసీగా, మృదువైనవి గా ఉంటాయి.అంతే కాకుండా మంచి సువాసన కూడా కలిగి ఉంటాయి.సాత్విక ఆహారం మంచితనానికి కూడా మద్దతు ఇస్తుంది.అలాగే ఆధ్యాత్మిక, అభివృద్ధికి, ధర్మబద్ధమైన జీవనానికి కూడా ఉత్తమంగా నిలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube