ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.53
సూర్యాస్తమయం: సాయంత్రం 06.01
రాహుకాలం:మ.09.00 ల10.30 వరకు
అమృత ఘడియలు: అమావాస్య మంచి రోజు కాదు
దుర్ముహూర్తం:ఉ.7.41 ల8.32వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీకు కొందరు ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.వారితో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోండి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
వృషభం:
ఈరోజు మీరంటే గిట్టని వారు విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.పరిచయం నిర్ణయాలు మార్చుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.
మిథునం:
ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ ఇతరుల సహాయంతో పూర్తి చేస్తారు.ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.భూమికి సంబంధించిన విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.
కర్కాటకం:
ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.కొందరు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
సింహం:
ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కన్య:
ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఇంటికి సంబంధించిన నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.
తులా:
ఈరోజు మీలో మానసిక బలహీనత ఎక్కువగా ఉంటుంది.ప్రారంభించిన పనులను చాలా నిదానంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు అవకాశం ఉంది.
తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.చాలా జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికం:
ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలసి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలందుతాయి.
ధనస్సు:
నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడం మంచిది.తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
మకరం:
ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరకదు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
కుంభం:
ఈరోజు మీకు బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.మీ స్నేహితులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.
మీనం:
ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.
LATEST NEWS - TELUGU