ప్రపంచవ్యాప్తంగా ముస్లింలందరూ రంజాన్ పవిత్ర మాసం( Ramadan ) లో కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు.ప్రతి ముస్లిం ఖచ్చితంగా ఉపవాసం ( fasting )ఉండి తీరాల్సిందే.
తీవ్రమైన వ్యాధులు, గర్భిణీ స్త్రీలు, రుతుస్రావ మహిళలు, చిన్నారులు తప్ప ప్రతి ఒక్కరూ ఈ ఉపవాసాన్ని పాటించాల్సిందే.ఇస్లాంలో ఉపవాసాల ప్రాముఖ్యత ఎందుకు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
పవిత్ర రంజాన్ మాసంలో ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు( Muslims ) కచ్చితంగా ఉపవాసాలు ఆచరిస్తారు.ఇదొక ఆరాధన మాసం.
ఈ మాసంలో అల్లాహ్ తన ప్రజలకు అత్యంత సమీపానికి వస్తాడు.
అందుకే ముస్లింలకు ఈనెల చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది.
అందువల్ల ఈ నెల అంతా కఠిన ఉపవాస దీక్ష ఆచరించడమే కాకుండా ఐదు పూటలా నమాజ్ చేస్తారు.ఉదయం సూర్యోదయానికి మందు సహరీ చేసి, సాయంత్రం సూర్యాస్తమయం వేళలో ఇఫ్తార్‌తో ఉపవాసం విరమిస్తారు.
రోజంతా కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు.

రంజాన్ మాసం అనేది పుణ్యం దయా కరుణ్యానికి వేదికైన మాసం.ఈ మాసంలో అల్లాహ్ ఆరాధనలో గడుపుతూ పుణ్యం సంపాదించుకుంటారు.ఇస్లామిక్ క్యాలెండర్ లో ప్రతి నెలకు 29 లేదా 30 రోజులు ఉంటాయి.29 రోజుల ఉపవాసాల అనంతరం నెలవంక కనిపించిన తర్వాత రోజు రంజాన్ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు.రంజాన్ నెల ప్రారంభం నెలవంక కనిపించడం పై ఆధారపడి ఉంటుంది.

షాబాన్ నెల 29వ రోజు నెలవంక కనిపిస్తే మరుసటి రోజు రంజాన్ మొదలవుతుంది.ఈ సంవత్సరం షాబాన్ 30 రోజుల తర్వాత రంజాన్ మొదలైంది.రంజాన్ నెలలో ప్రజలు తమలోని చెడును, ద్వేషాన్ని తొలగించేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు.ఈ మాసంలో ఖురాన్ పఠనం, నమాజ్, అల్లాహ్ ఆరాధనలో ప్రజలు ఎక్కువగా గడుపుతారు.
ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఈ మాసంలో అవతరించింది కాబట్టి ఈ మాసంలో ఉపవాసాలు ఉంటారు.రంజాన్ నెలలో మంచి పనులు, దానాలతో పుణ్యం సంపాదించుకునేందుకు ప్రజలందరూ పోటీ పడుతూ ఉంటారు.
ఇంకా చెప్పాలంటే ఇస్లాంలో ఉపవాసాల విధి రెండవ శకంలో మొదలైంది.