మహా భారతంలోని పర్వాలెన్ని? ఎందులో ఏముంటుంది?

మహా భారతంలో మొత్తం 18 పర్వాలు ఉన్నాయి.అందులో మొదటిది ఆది పర్వం, ఇందులో కురువంశ కథ, రాకుమారుల జననం, విద్యాభ్యాసం గురించి వివరించబడి ఉంటుంది.

 How Many Parvas In Mahabharata Details, Mahabharatham, Mahabharatham Parvas, Tot-TeluguStop.com

రెండో సభా పర్వం.ఇందులో కురసభా రంగం, మయసభ, పాచికల ఆట, పాండవుల ఓటమి, రాజ్య భ్రష్టత గురించి ఉంటుంది.

మూడోది వన పర్వం లేక అరణ్య పర్వం.ఇందులో పాండవులు 12 సంవత్సరాల పాటు చేసిన అరణ్య జీవనం గురించి వివరించబడి ఉంటుంది.

నాలుగోది విరాట పర్వం.ఇందులో విరాట రాజు కొలువులో పాండువులు ఏడాది పాటు చేసిన అజ్ఞాత వాసం గురించి ఉంటుంది.

ఐదోది ఉద్యోగ పర్వం.అందులో కౌరవ పాండవ సంగ్రామానికి సన్నాహాలు ఉంటాయి.

ఆరోది భీష్మ పర్వం.ఇందులో భీష్ముని నాయకత్వంలో సాగిన యుద్ధం గురించి ఉంటుంది.

ద్రోణ పర్వం.ఇందులో ద్రోణుని నాయకత్వంలో సాగిన యుద్ధం గురించి ఉంటుంది.

ఎనిమిదోది కర్ణ పర్వం.ఇందులో కర్ణుని నాయకత్వంలో సాగిన యుద్ధం గురించి వివరించబడింది.

తొమ్మిదోది శల్య పర్వం.ఇందులో శల్యుడు సారథిగా సాగిన యుద్ధం గురించి ఉంటుంది.

పదోది సౌప్తిక పర్వం.ఇందులో నిదురిస్తున్న ఉప పాండవులను అశ్వత్థామ వధించడం గురించి ఉంటుంది.

పదకొండోది స్త్రీ పర్వం.ఇందులో గాంధారి మొదలగు స్త్రీలు, మరణించిన వారికోసం రోదించడం ఉంటుంది.

పన్నెండోది శాంతి పర్వం.ఇందులో యుధిష్టరుని రాజ్యాభిషేకం, భీష్ముని ఉపదేశాలు ఉంటాయి.

పదమూడోది అనుశాసనిక పర్వం.ఇందులో భీష్ముని చివరి ఉపదేశాలు ఉంటాయి.పద్నాలుగవది అశ్వమేధ పర్వం.ఇందులో యుధిష్టరుని అశ్వమేధ యాగం గురించి ఉంటుంది.పదిహేనవది అశ్రమవాస పర్వం. ఇందులో ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ప్రభృతులు చివరి రోజులు ఆశ్రమ వాసులుగా గడపడం గురించి ఉంటుంది.

పదహారవది మౌసల పర్వం.ఇందులో యదువంశంలో ముసలం, అంతః కలహాల గురించి ఉంటుంది.

పదిహేడవది మహా ప్రస్థానిక పర్వం.ఇందులో పాండవుల స్వర్గ ప్రయాణ ఆంరంభం గురించి ఉంటుంది.

పద్దెనిమిదవది స్వర్గారోహణ పర్వం.ఇందులో పాండువులు స్వర్గాన్ని చేరడం గురించి ఉంటుంది.

How Many Parvas In Mahabharata Details, Mahabharatham, Mahabharatham Parvas, Total 18 Parvas, Bheeshma, Kauravas, Pandavas,aswametha Yagam, Sabha Parvam, Aadi Parvam - Telugu Aadi Parvam, Aswametha Yagam, Bheeshma, Devotional, Kauravas, Maha Bharatham, Pandavas, Sabha Parvam, Parvas

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube