గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్-19 మళ్లీ మనదేశంలో ఈ వైరస్ కేసులో మళ్ళీ కనిపించడంతో మనదేశంలోని రద్దీ ప్రదేశాలలో కొన్ని కఠినమైన నియమాలను కచ్చితంగా పాటించాల్సిందే అని సంబంధిత ప్రదేశాల అధికారులు స్పష్టం చేస్తున్నారు.ఇంకా చెప్పాలంటే మన దేశంలో కొత్త సంవత్సరం వేడుకల కోసం ప్రజలు సిద్ధమవుతున్నారు.
కొత్త సంవత్సరంతో పాటు రానున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు భారీగా తిరుమలకు వచ్చే అవకాశం ఉంది.ఈ క్రమంలోనే టీటీడి బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
జనవరి రెండు నుంచి వైకుంఠ ఏకాదశి పర్వదినాలు ప్రారంభమై జనవరి నెల 11వ తేదీ అర్ధరాత్రి వరకు ఈ సమయం ఉంది.
ఇంకా చెప్పాలంటే కొత్త సంవత్సరం, వైకుంఠ ద్వార దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం భారీగా ఏర్పాట్లను చేస్తుంది.
తిరుమల దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.ఇతర ప్రాంతాల్లో అన్నా ప్రసాదాలు, తాగునీరు, టీ, కాఫీలు పంపిణీ చేసినందుకు ఏర్పాట్ల చేస్తున్నట్లు తెలిపారు.
భక్తులు తిరుపతిలో టైమ్స్లా న్ టోకెన్లు పొంది వైకుంఠ ద్వార దర్శనానికి రావాలని తెలిపారు.సామాన్య భక్తుల సౌకర్యం కోసం జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు బ్రేక్ దర్శనాల కోసం వీఐపీల సిఫారస్ లేఖలు స్వీకరించబడవని ఈ సందర్భంగా తెలిపారు.
స్వయంగా వచ్చే విఐపి లకు బ్రేక్ దర్శనాలు కల్పిస్తామని తెలిపారు.మనదేశంలో మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి పై కేంద్ర మార్గదర్శకాలను అనుసరిస్తూ తిరుమలకు వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి రావాలని తెలిపారు.
ఇంకా చెప్పాలంటే టికెట్లు లేదా టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తామని వెల్లడించారు.
.






