బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ లో ప్రభాస్ పాల్గొన్నాడు.అందుకు సంబంధించిన ఎపిసోడ్ కోసం అభిమానులు మరియు ప్రేక్షకులు రెండు వారాలుగా ఎదురు చూస్తున్నారు.
రేపు కొత్త సంవత్సరం కానుకగా ఆహా లో ప్రభాస్ అతిధిగా హాజరు అయిన అన్ స్టాపబుల్ షో స్ట్రీమింగ్ అవ్వబోతుంది.భారీ ఎత్తున అంచనాలున్న అన్ స్టాపబుల్ షో లో ప్రభాస్ పెళ్లి గురించి మరియు ఇంకా చాలా విషయాల గురించి బాలకృష్ణ చెప్పించబోతున్నాడు.
ప్రభాస్ సాదారణంగా అన్ని విషయాలను బయటకు చెప్పడు.కానీ బాలయ్య మాత్రం సాధ్యం అయినన్ని ఎక్కువ విషయాలను బయటకు తీసుకు వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.
బాలయ్య మరియు ప్రభాస్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ను రెండు పార్ట్ లు గా విభజించారనే వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రెండున్నర గంటల పాటు మొత్తం ఎపిసోడ్ వచ్చిందట.దాంతో రెండు పార్ట్ లు గా తీసుకు వస్తే బాగుంటుంది అనే ఉద్దేశ్యం తో ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.ప్రభాస్ తో పాటు ఈ షో లో గోపీచంద్ కూడా పాల్గొన్నాడు.
ప్రభాస్ కు సన్నిహితుడు అయిన గోపీచంద్ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు.ప్రభాస్ పెళ్లి గురించి బాలయ్య ఏమన్నాడు అనేది అందరికి ఆసక్తిని కలిగిస్తోంది.
ఇక షో మధ్య లో రామ్ చరణ్ కూడా ఫోన్ ద్వారా అందుబాటు లోకి వచ్చాడు.దాంతో షో కి మరింతగా హైప్ వచ్చినట్లు అయ్యింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
ఆకట్టుకునే విధంగా ఉండే ఈ షో లో ఎన్నో సర్ ప్రైజ్ లు ఉంటాయని అంటున్నారు.మొదటి ఎపిసోడ్ లో ఏ విషయాలు ఉంటాయి.
రెండవ ఎపిసోడ్ కు ఏ విషయాలు దాచారు అనేది తెలియాలి అంటే మరి కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.







