నూతన సంవత్సరంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వారాహి వాహనానికి పూజ చేయించనున్నారు.ఈ మేరకు తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో వారాహికి ప్రత్యేక పూజ జరగనుందని సమాచారం.
వచ్చే నెల 2న ఏకాదశిని పురస్కరించుకొని జనసేన నేతలు వాహన పూజకు ఏర్పాట్లు చేస్తున్నారు.అయితే పవన్ కల్యాణ్ నేరుగా పాల్గొని ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.
అనంతరం ఏపీలోని విజయవాడ కనకదుర్గ ఆలయంలోనూ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఏపీలో రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చేసేందుకు జనసేనాని ప్రత్యేకంగా వారాహి వాహనాన్ని సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే.







