సాధారణంగా అమ్మాయిల్లో చాలా మంది సిల్కీ హెయిర్( Silky Hair ) ను ఇష్టపడుతూ ఉంటారు.ఎందుకంటే సిల్కీ హెయిర్ మృదువుగా మెరుస్తూ ఉంటుంది.
ఆకర్షణీయంగా కనిపిస్తుంది.అందుకే అటువంటి జుట్టును పొందాలని ఆరాటపడుతుంటారు.
ఇందులో భాగంగానే కొందరు వేలకు వేలు ఖర్చు పెట్టి సెలూన్ లో సిల్కీ హెయిర్ కోసం పలు ట్రీట్మెంట్స్ చేయించుకుంటారు.కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే సిల్కీ హెయిర్ పొందవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ బెస్ట్ ఆప్షన్( Best Remedy ).మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు వేసి ఉడికించాలి.
దాదాపు 15 నిమిషాల పాటు ఉడికిస్తే వాటర్ జెల్ గా మారుతుంది.

అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో జెల్ ను సపరేట్ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఉడికించిన రైస్ వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు నైట్ అంతా వాటర్ లో నానబెట్టుకున్న మెంతులు, రెండు ఫ్రెష్ మందారం పూలు, రెండు రెబ్బలు కరివేపాకు( Curry Leaves ) మరియు తయారుచేసి పెట్టుకున్న అవిసె గింజల జెల్( Flax Seeds gel ) వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.

వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ రెమెడీని పాటించారంటే రిజల్డ్ అదిరిపోతుంది.రైస్, మెంతులు, మందారం పూలు, కరివేపాకు మరియు అవిసె గింజల జెల్ ఇవన్నీ జుట్టు ఆరోగ్యానికి తోడ్పడతాయి.జుట్టులో తేమను పెంచుతాయి.కురులు సిల్కీగా షైనీ గా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.సిల్కీ హెయిర్ పొందాలనుకుంటున్న వారికి ఈ రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి.
హెయిర్ ఫాల్ సమస్య( Hair Fall Problem ) దూరం అవుతుంది.జుట్టు ఒత్తుగా బలంగా పెరుగుతుంది.







