తిరుమల( Tirumala ) కొండ పైన ప్రస్తుతం రద్దీ స్వల్పంగా తగ్గిపోయింది.అయితే నాలుగు రోజులు వరుసగా సెలవులతో తిరుమల గిరులు భక్తుల రద్దీతో నిండిపోయాయి.
దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది.అయితే తిరుమల శ్రీవారికి బెంగళూరుకు( Bangalore ) చెందిన ఓ భక్తుడు 250 ఎకరాల భూమి విరాళంగా ప్రకటించాడు.
అయితే ఆ భూమిలో తానే స్వయంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆహార ఉత్పత్తులను పండించి టీటీడీకి అప్పగించనున్నారు.అంతేకాకుండా అగ్గిపెట్టలో పట్టే శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారికి బంగారు చీరలను మరో భక్తుడు అందించారు.

తిరుమల శ్రీవారి దేవస్థానానికి బెంగళూరుకు చెందిన భక్తుడు మురళీకృష్ణ( Muralikrishna ) దాదాపు తన 250 ఎకరాల భూమిని విరాళంగా శ్రీవారికి అందించేందుకు సిద్ధమయ్యాడు.అయితే సైదాపురం మండలం పోతే గుంటలో ఉన్న భూమిని ఆదివారం రోజున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.జవహర్ రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణ రెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించడం జరిగింది.అయితే బెంగళూరుకు చెందిన మురళీకృష్ణకు పోతే గుంటలో 90 ఎకరాలు, పోతే గుంటకు పక్కనే ఉన్న తిరుపతి జిల్లా డక్కలి మండలం దగ్గవోలీలో 160 ఎకరాలు మొత్తం 250 ఎకరాల బీడు భూములు ఉన్నాయి.
ఆ భూముల్లో ఆయనే స్వయంగా టీటీడీకి కావలసిన ఆహార ఉత్పత్తులు, అలాగే పూల సాగు చేసి అప్పగించేందుకు ముందుకు వచ్చారు.

దీంతో అధికారుల బృందం నీటి వసతి, ఇతర సౌకర్యాల గురించి కూడా పరిశీలించడం జరిగింది.అలాగే ఆ భూముల రికార్డులపై రెవెన్యూ అధికారులకు సూచనలు కూడా ఇచ్చారు.దీంతో ఆ భూముల మ్యాపులను పరిశీలించారు.
అంతేకాకుండా ఆ భూమిలో తనే స్వయంగా ప్రకృతి వ్యవసాయం చేసి ఆహార ఉత్పత్తులను పండించి టీటీడీకి అప్పగించడం విశేషంగా చెప్పుకోవాలి.ఇక మరో భక్తుడు తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లకు చెందిన శ్రీ నల్ల విజయ్ ఆదివారం రోజున తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అలాగే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టే బంగారు చీరలను బహుకరించారు.