ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.52
సూర్యాస్తమయం: సాయంత్రం 06.06
రాహుకాలం:మ.3.00 సా4.30 వరకు
అమృత ఘడియలు:ఉ.10.30 ల11.15 సా4.00 ల6.00
దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11.15 మ12.00వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎదుర్కొంటారు.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.
అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.
వృషభం:
ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన సక్రమంగా సాగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు ఆలోచనలు ఎంతో అవసరం.
మిథునం:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.మీరు పని చేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.
కర్కాటకం:
మీరు మీ కుటుంబ సభ్యులకు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.
దూరప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.అది మీ మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.
సింహం:
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఎక్కువగా ఉంటాయి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.శత్రువులకు వీలైనంత దూరంగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో చాలా నష్టాలు ఎదురవుతాయి.
కన్య:
ఈరోజు మీకు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.సంతానం నుండి శుభవార్త వింటారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుసుకుంటారు.
ఇతరులతో మాట్లాడేటప్పుడు కొత్త విషయాలను తెలుసుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.
తులా:
ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.మీ పాత స్నేహితులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.విదేశాల్లో ఉద్యోగ అవకాశం అందుకుంటారు.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
వృశ్చికం:
ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీరు పని చేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.
సంతానం గురించి ఆలోచన చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకపోవడం మంచిది.
మకరం:
ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.
కుంభం:
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.దీనివల్ల మనశ్శాంతి ఉంటుంది.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు
మీనం:
ఈరోజు మీకు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.
నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
DEVOTIONAL