కన్నడ నటుడు రిషబ్ శెట్టి గత ఏడాది కాంతార సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.కాంతార సినిమా సాధించిన వసూళ్లు అందరిని ఆశ్చర్య పరిచాయి.
బాబోయ్ అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఆ సినిమా కేవలం కన్నడంలో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా హిట్ అయ్యింది.
హిందీలో కాంతార సినిమాకు వచ్చిన వసూళ్లు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపర్చాయి అనడంలో సందేహం లేదు.కాంతార సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా రిషబ్ శెట్టి నిలవడంతో ప్రతి ఒక్కరు కూడా ఆయన్ను తమ సినిమా లో నటింపజేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
అందులో భాగంగానే రిషబ్ శెట్టి ఒక తెలుగు స్టార్ హీరో సినిమా కోసం సంప్రదించబడ్డాడట.కీలకమైన పాత్రలో నటించాల్సిందిగా తెలుగు నిర్మాతలు ఆయన్ను సంప్రదించారట.
అందుకు గాను రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారని.కేవలం 30 నుండి 40 రోజుల డేట్లు ఇస్తే సరిపోతుందని కూడా పేర్కొన్నారట.అయినా కూడా రిషబ్ శెట్టి ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది.చాలా కాలంగా రిషబ్ శెట్టి తదుపరి సినిమా విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు.అదుగో ఇదుగో అంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నాడు.
మళ్లీ కాంతార రేంజ్ లోనే ఉండాలని ఆయన భావిస్తున్నాడు.తన తదుపరి సినిమాను కూడా స్వీయ దర్శకత్వంలో రూపొందించబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.
తప్పకుండా కన్నడ సినీ ఇండస్ట్రీతో పాటు ఇతర భాషల ప్రేక్షకులను కూడా మెప్పించే విధంగా రిషబ్ శెట్టి తదుపరి సినిమా ఉంటుందట.సొంత దర్శకత్వంలో చేయాలని ఉన్న కారణంగానే టాలీవుడ్ స్టార్ హీరో సినిమా లో ఈయన నటించేందుకు నో చెప్పాడు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.