క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ముందే వరల్డ్ కప్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు.. ఎలా అంటే..?

త్వరలో వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) ప్రారంభం కాబోతుంది.ప్రముఖ దేశాల టీమ్‌లు పాల్గొనే ఈ టోర్నీ కోసం క్రికెట్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Icc Cricket World Cup 2023 Match Tickets Sbi Pre Window Booking Details, Good Ne-TeluguStop.com

నెల రోజుల పాటు జరిగే ఈ టోర్నీ ఫ్యాన్స్‌కు మంచి థ్రిల్‌ను అందించనుంది.వరల్డ్ కప్ కావడంతో క్రికెట్ ఫ్యాన్స్‌నే కాకుండా.

సామాన్య ప్రేక్షకులు కూడా మ్యాచ్‌లను చూస్తారు.అయితే టీవీలోనే కాకుండా డైరెక్ట్‌గా స్టేడియానికి వెళ్లి మ్యాచ్‌లు చూడాలని చాలామంది అనుకుంటూ ఉంటారు.

ఫ్రెండ్స్‌తో వెళ్లి స్టేడియంలో గోల గోల చేస్తూ మ్యాచ్‌ను చూడాలని భావిస్తూ ఉంటారు.

Telugu Cricket Fans, Icc Cricket Cup, Latest, Tickets, Sbi Master, Sbi Pre Windo

ఈ క్రమంలో క్రికెట్ లవర్స్‌కు ఎస్‌బీఐ( SBI ) అదిరిపోయే శుభవార్త తెలిపింది.ముందే టికెట్లు( Tickets ) బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.క్రికెట్ ప్రేక్షకుల కోసం ప్రి విండో ఆప్షన్‌ను( Pre Window Booking ) ఎస్‌బీఐ అందుబాటులోకి తెచ్చింది.

దీని ద్వారా వరల్డ్ కప్ టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు.కేవలం రెండు రోజులు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని, తర్వాత ఈ బెనిఫిట్ పొందలేరని ఎస్‌బీఐ స్పష్టం చేసింది.

ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ప్రీ విండో టికెట్ బుకింగ్ పేరుతో ముందు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

Telugu Cricket Fans, Icc Cricket Cup, Latest, Tickets, Sbi Master, Sbi Pre Windo

అయితే ఎస్‌బీఐ మాస్టర్ కార్డు( SBI Master Card ) కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.ఆగస్టు 29 సాయంత్రం 6 గంటల నుంచి ఆగస్ట్ 30 సాయంత్రం 6 గంటల వరకు ప్రీ సేల్ బుకింగ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.ఈ సమయంలో మీరు టీమిండియా మ్యాచ్ లకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

ఈవిషయాన్ని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఎస్‌బీఐ తెలిపింది.ఈ మేరకు ఒక లింక్ ను ఎస్‌బీఐ పోస్ట్ చేసింది.

ఆ లింక్ ఓపెన్ చేసి టికెట్లను బుక్ చేసుకోవచ్చు.రెండు రోజులు మాత్రమే ఈ అవకాశం ఉండటంతో ఆసక్తి ఉన్నవారు వెంటనే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube