దీపికా పదుకొనేకు ఇష్టమైన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా.. ప్రభాస్ మాత్రం కాదంటూ?

తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే( Deepika Padukone ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలీవుడ్( Bollywood ) లో ఎన్నో సినిమాలలో హీరోయిన్గా నటించిన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది దీపిక పదుకొనే.

 Interesting Facts About Kalki 2898 Ad Star Deepika Padukone, Deepika Padukone, B-TeluguStop.com

మొన్నటి వరకు బాలీవుడ్ సినిమాలలో నటించి అలరించిన దీపికా ఇప్పుడు ప్రభాస్ నటించిన కల్కి మూవీతో నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది.ఈ సినిమా ఈనెల 27న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా గడుపుతోంది దీపికా పదుకొనే.

Telugu Bollywood, Kalkiad, Kalki, Mahesh Babu, Prabhas, Tollywood-Movie

అయితే ప్రస్తుతం ఆమె గర్భవతి అన్న విషయం మనందరికీ తెలిసిందే.అయినా కూడా కల్కి సినిమా ప్రమోషన్స్( Kalki Movie Promotions ) లో పాల్గొంటూ అందరి చేత శభాష్ అనిపించుకుంటోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా దీపికా పదుకొనే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

చదువును మధ్యలోనే ఆపేసి, మోడలింగ్‌ రంగాన్ని ఎంచుకుంది.అమ్మానాన్నను ఎంతమంది విమర్శించినా వారు నన్ను ఒక్కమాట కూడా అనలేదంటూ తల్లీదండ్రుల గురించి ఒక సందర్భంలో గొప్పగా చెప్పకొచ్చింది.

ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొన్నాళ్లకు దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేసింది దీపికా.

Telugu Bollywood, Kalkiad, Kalki, Mahesh Babu, Prabhas, Tollywood-Movie

ఆ తరువాత హీరోగా తెరకెక్కిన కన్నడ చిత్రం ఐశ్వర్య ( Aishwarya )అనే సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేశారు.అది తెలుగు హిట్‌ మూవీ మన్మథుడు కు రీమేక్‌గా రూపొందింది.ఇక్కడ సోనాలీ బింద్రే పోషించిన పాత్రలో అక్కడ దీపిక నటించారు.

ఈ సినిమా తరువాత దీపిక తొలి బాలీవుడ్‌ సినిమా ఓం శాంతి ఓం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.ఈ మూవీ భారీ సక్సెస్ అవ్వడంతో దీపికాకు మంచి ప్రశంసలు దక్కాయి.

ఈ సినిమా తర్వాత చాలా సినిమాలలో నటించి మెప్పించింది దీపికా.కాగా ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో మహేష్ బాబు( Mahesh Babu ) అంటే చాలా ఇష్టమట.

మహేష్ బాబు తో పాటు ఈమెకు రానా అంటే కూడా చాలా ఇష్టం అని ఆమె తెలిపింది.ఈమెకు రానా క్లోజ్ ఫ్రెండ్ కావడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube